
తెలంగాణ పారిశ్రామిక రంగంలో కొత్త అధ్యయనం
తెలంగాణ సర్కార్‌తో రూ.1000 కోట్ల ఎంఓయూ చేసుకున్న అమెరికా సంస్థ.
డావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు(WEF) 2026లో తెలంగాణ పరిశ్రమల అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. అమెరికాకు చెందిన పారిశ్రామిక పెట్టుబడి వేదిక సార్గాడ్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.
సార్గాడ్ సీఈఓ శ్రీనివాస్ తోటా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందంతో సమావేశమై దీర్ఘకాలిక దశలవారీ పెట్టుబడులపై ఆసక్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక ఎకోసిస్టమ్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సంస్థ తెలిపింది.
ఏరోస్పేస్ రక్షణ ఆటోమోటివ్ ఆధునిక తయారీ రంగాల్లో అనుభవం ఉన్న సార్గాడ్ సంస్థ తెలంగాణలో విమానాల మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్‌హాల్ కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. తెలంగాణ ఆర్థిక అభివృద్ధి వ్యూహాన్ని ముఖ్యమంత్రి వివరించారు. సేవల రంగానికి సీయూఆర్ఈ తయారీ రంగానికి పీయూఆర్ఈ వ్యవసాయ పచ్చ ఆర్థిక రంగానికి ఆర్ఏఆర్ఈ అనే మూడు వృద్ధి ప్రాంతాల ఏర్పాటు గురించి తెలియజేశారు.
వరంగల్ అదిలాబాద్ ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాల అభివృద్ధి కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ఎంఆర్ఓ కేంద్రం ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని సార్గాడ్‌ను ఆహ్వానించారు. వరంగల్ అదిలాబాద్ ప్రాంతాల్లో పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని తెలంగాణ ఎంఎస్‌ఎంఈలకు పరికరాల తయారీ అనుబంధ సరఫరా రంగాల్లో ఉన్న అవకాశాలపై చర్చించారు.

