గ్యాంగ్ రేప్ కేసు పెట్టి కటకటాల పాలైన ఈ యువతి కథేంటంటే...
x

గ్యాంగ్ రేప్ కేసు పెట్టి కటకటాల పాలైన ఈ యువతి కథేంటంటే...

ఇక్కడో మహిళ తనపై గ్యాంగ్ రేప్ జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసి తానే బుక్ అయింది. జరగని ఘటనను జరిగినట్టు చెప్పి కటకటాలపాలైన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది


మనుషులు రకరకాలు.. ఇక్కడో మహిళ తనపై గ్యాంగ్ రేప్ జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసి తానే బుక్ అయింది. జరగని ఘటనను జరిగినట్టు చెప్పి కటకటాలపాలైన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ప్రస్తుతం ఈ మహిళ తీరు పోలీసుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోందట.
ఇంతకీ విషయం ఏమిటంటే..
తన భర్త స్నేహితులపై కిడ్నాప్, గ్యాంగ్ రేప్ చేసినట్లు తప్పుడు ఫిర్యాదు చేసినందుకు 27 ఏళ్ల మహిళను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. గ్రేటర్ నోయిడాలోని దాద్రి నివాసి అయిన ఆ మహిళ, ఫిబ్రవరి 24న ఈమేరకు ఫిర్యాదు చేశారు. తాను మార్కెట్‌కు వెళుతుండగా వైభవ్, దీపక్ చౌహాన్ మరికొందరు కలిసి కిడ్నాప్ చేసి కారులో తీసుకువెళ్లారని, కదులుతున్న కారులోనే లైంగిక దాడి చేసి నానా బీభత్సం చేశారని ఆరోపించింది. దీంతో కంగుతిన్న పోలీసులు ఇదేదో పెద్ద వ్యవహారంగా భావించి రంగంలోకి దిగారు.
ఈమె చెప్పిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. సంఘటన జరిగిన సమయంలో నిందితుల్లో ఒకడు ఇంట్లో ఉండగా, మరొక నిందితుడు తన కుటుంబంతో కలిసి వివాహానికి హాజరవుతున్నాడు. ఆ మహిళ భర్త - వికాస్ త్యాగి - ఆమె మోపిన గృహ హింస ఆరోపణలపై ప్రస్తుతం దస్నా జైలులో ఉన్నాడు.
తప్పుడు ఫిర్యాదు దాఖలు చేయడానికి ఉద్దేశ్యం వాస్తవానికి ఆమె భర్తపై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం అని పోలీసులు గుర్తించారు. తన భర్త స్నేహితులు వైభవ్, దీపక్ ఆ మహిళ పెట్టిన కేసులో అతనికి మద్దతు ఇవ్వడం, ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించడంలో సహకరిస్తుండడంతో ఆమె ఈ తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని ఘజియాబాద్ డీసీపీ చెబుతున్నారు.
పోలీస్ దర్యాప్తులో ఆ మహిళ కి నేర చరిత్ర ఉన్నట్టు తేలింది. ఆమె కొంతకాలం కిందట ఓ వ్యక్తితో సహజీవనం చేశారు. గత ఏడాది జూన్‌లో ఈమె పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. తన భర్తకు వేరే పురుషునితో స్వలింగ సంపర్కం ఉందని, దాన్ని వద్దన్నందుకు కడుపులో తన్నాడని, దీంతో తాను చనిపోయిన బిడ్డకు జన్మనివ్వాల్సివచ్చిందని ఆరోపించారు. కొన్ని రోజుల తర్వాత ఆమె తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. స్వలింగ సంపర్కం వారి ఇష్టమంటూ ఇందుకు కారణం చెప్పారు.
ఆ తర్వాత కొన్ని నెలలకు మరో ఫిర్యాదుతో ఆమె మళ్లీ పోలీసుల్ని ఆశ్రయించారు. అది తన భర్తగా చెబుతున్న విక్యాస్ త్యాగీ అరెస్ట్ కు దారి తీసింది. ఈ విషయమై ప్రస్తుతం కేసు నడుస్తోంది. ఈ కేసులో వికాస్ త్యాగీ స్నేహితులు వైభవ్, దీపక్ తనకు సహకరించకుండా తన భర్తకు సహకరిస్తున్నారన్నకోపంతో వాళ్లపై గ్యాంగ్ రేప్ కేసు పెట్టింది. కారులో తనపై అత్యాచారం చేశారని, మెహ్రౌలి రైల్వే క్రాసింగ్ సమీపంలోని చెత్త కుప్ప దగ్గర పడేశారని ఆమె ఆరోపించింది. అక్కడ ఆమె చాలాసేపు అప స్మారక స్థితిలో ఉన్నానని, స్పృహలోకి వచ్చిన తర్వాత, రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చానని, తరువాత 112కి డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చానని తెలిపింది.
అయితే, సిసిటివి ఫుటేజ్, కాల్ డేటా వివరాలు ఏవీ ఆమె చేసిన ఆరోపణలతో సరిపోలడం లేదు. ఆమె తనంతట తానుగా రాత్రి 8.27 గంటలకు కారు ఎక్కి, సంఘటన జరిగిన రోజు రాత్రి 10.19 గంటలకు అదే స్థలానికి తిరిగి వచ్చినట్లు ఫుటేజ్‌లో చూపించారు. వైద్య పరీక్షలో కూడా ఆమె ఆరోపణలకు మద్దతు ఇచ్చే దాడి లేదా గాయాలకు సంబంధించిన ఆధారాలు కనిపించలేదు.
"మెహ్రౌలి క్రాసింగ్ దగ్గర తనను విసిరివేశారని నిందితురాలు చెబితే సీసీటీవీ ఫుటేజీలో పేర్కొన్న సమయంలో ఆ వైపు నుండి ఏ మహిళ కూడా నడుచుకుంటూ వెళ్లడం కనిపించలేదు. డబ్బు, ఫ్లాట్ కోసం ఆమె తప్పుడు ఆరోపణలు చేసినట్లు మా దర్యాప్తులో తేలింది" అని డీసీపీ చెప్పారు.
"ఇద్దరు నిందితుల ఫోన్ లొకేషన్‌లను కూడా మేము ట్రాక్ చేశాం. అపహరణ జరిగిన సమయంలో వైభవ్ చౌహాన్ ఉన్న ప్రదేశం మోర్టి అని తేలింది. మరోవైపు, దీపక్ చౌహాన్ తన బంధువు వివాహానికి హాజరయ్యాడు. అతని ఫోన్ రాత్రి 7.12 గంటలకు మరియం నగర్‌లో, రాత్రి 9.46 గంటలకు సేవా నగర్, మరియం నగర్‌లో అతను ఉన్నట్టు సూచించింది" అని అధికారి తెలిపారు.
నిందితుల్లో ఒకడు తన ఎడమ భుజానికి ఇంజెక్షన్ ఇచ్చాడని, మెడపై యాసిడ్ దాడి జరిగిందని ఆ మహిళ తన ఫిర్యాదు చెబుతూ విచారణలో మాత్రం కుడి భుజాన్ని చూపించారు. యాసిడ్ దాడి జరిగిన దాఖలాలు కనిపించడం లేదని పోలీసులు చెప్పారు. దీంతో ఆమెపై
మోసం, దోపిడీ, తప్పుడు సాక్ష్యాలను కల్పించడం వంటి సెక్షన్ల కింద ఆ మహిళపై FIR నమోదు చేశారు.
ఘజియాబాద్‌కు చెందిన ఈ మహిళ.. కొంతకాలంగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, కులం పేరుతో దూషించి, హింసించాడని ఆరోపిస్తూ భర్తపై ఈ ఏడాది జనవరిలో మరో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో అతడు ప్రస్తుతం జైలుకు వెళ్లాడు.
Read More
Next Story