తాత్కాలిక జైలుగా మార్చాలన్న ప్రతిపాదనను తిరస్కరించిన ఆప్‌
x

తాత్కాలిక జైలుగా మార్చాలన్న ప్రతిపాదనను తిరస్కరించిన ఆప్‌

ఢిల్లీలోని బవానా స్టేడియంను తాత్కాలిక జైలుగా మార్చాలన్న కేంద్రం ప్రతిపాదనను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది.


పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కల్పించడంతో పాటు తమ మిగతా డిమాండ్లను ఆమోదించాలని రైతులు రోడెక్కారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు దేశ రాజధానికి పాదయాత్రగా బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని బవానా స్టేడియంను తాత్కాలిక జైలుగా మార్చాలన్న కేంద్రం ప్రతిపాదనను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది.

ఢిల్లీ హోం మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ అనుమతిని నిరాకరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్‌ కుమార్‌కు లేఖ రాయడంతో పాటు రైతుల పాదయాత్రకు సంఫీుభావం తెలిపారు.

‘‘రైతుల డిమాండ్లు నిజమైనవి. రెండోది శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కు. అందువల్ల రైతులను అరెస్టు చేయడం సరికాదు’’ అని నరేష్‌ కుమార్‌కు రాసిన లేఖను గెహ్లాట్‌ చదివారు.

‘‘కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి వారి సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నించాలి. దేశంలోని రైతులు మా ‘అన్నదాతలు’. వారిని అరెస్టు చేయడం సరికాదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి మేం వ్యతిరేకిస్తున్నాం’’ అని గెహ్లాట్‌ పేర్కొన్నారు.

సంయుక్త కిసాన్‌ మోర్చా (నాన్‌ పొలిటికల్‌), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా మంగళవారం ఉదయం ఢిల్లీ వైపు పాదయాత్రను ప్రారంభించాయి.

Read More
Next Story