ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్యం సీరియస్...
x

ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్యం సీరియస్...

ఇటీవలే ఆయన హైదరాబాద్ వచ్చి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


పౌర హక్కుల ఉద్యమకారుడు, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా ఆనారోగ్యం విషయమించినట్లు సమాచారం అందింది. ఆయనను ఢిల్లీ వసంత్ కుంజ్ లోని ఐఎబిఎస్ (Institute of Liver and Biliary Sciences) చికిత్సకు చేర్పించనట్లు తెలిసింది. ఆయన పరిస్థితి గురించి, చికిత్స గురించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

జీఎన్‌ సాయిబాబా మార్చి ఏడో తేదీన నాగ్‌పూర్‌ కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయన్న ఆరోపణల ఆయన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఎజన్సీ పోలీసులు అరెస్టు చేశారు. దేశద్రోహం నేరం మోపారు. చాలా కాల జ్యుడిషల్ నిర్బందలోనే ఉన్నారు. 90 శాతం వైకల్యంతో వీల్‌చైర్‌కే పరిమితమైన సాయిబాబా విడుదల చేయాలని దేశవ్యాపితంగా మేధావులు కేంద్రం మీదవత్తిడి తీసుకువచ్చారు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విడుదల చేయాలని కోరారు. అయితే, బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచి ఆయన మీద ఉన్న కేసులను కొట్టి వేస్తూ ఇచ్చిన తీర్పు మేరకు జైలు నుంచి ఆయన బయటకు వచ్చారు. మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకుని దేశద్రోహానికి పాల్పడ్డారన్న ఆరోపణపై ఆయనతో పాటు మరో ఐదుగురికి మహారాష్ట్ర, గడ్చిరోలి ట్రయిల్‌ కోర్టు జీవిత ఖైదు విధించడంతో 2017 నుంచి నాగ్‌పూర్‌ జైలులోనే ఉన్నారు. అయితే, ఆరోపణలకు పోలీసులు ఆధారాలు చూపలేకపోయారని హైకోర్టు పేర్కొంటూ కేసును కొట్టివేసింది అంతకుముందు కూడా ఆయన 2014 నుంచి 2016 వరకు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలయ్యారు.


Read More
Next Story