తిరిగి ఫుంజుకున్న అదానీ షేర్లు.. ఎంతశాతం పెరిగాయంటే..
x

తిరిగి ఫుంజుకున్న అదానీ షేర్లు.. ఎంతశాతం పెరిగాయంటే..

హిండెన్ బర్గ్ నివేదికతో సోమవారం భారీగా పతనమైన అదానీ గ్రూపు షేర్లు మంగళవారం నాడు తిరిగి లాభాలబాట పట్టాయి. అదానీకి సంబంధించిన పది షేర్లలో తొమ్మిది షేర్లు ..


హిండెన్ బర్గ్ మరోసారి సెబీ, అదానీ గ్రూపు పై నివేదిక ను విడుదల చేయడంతో అదానీ గ్రూపు షేర్లు సోమవారం నాడు దాదాపు 17 శాతం మేర నష్టపోయాయి. అయితే మంగళవారం నాడు స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ప్రారంభం కాగాన అదానీ గ్రూప్‌లోని పది కంపెనీల్లో తొమ్మిది షేర్లు ప్రారంభ ట్రేడింగ్‌లో తిరిగి పుంజుకున్నాయి.

మంగళవారం, BSEలో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ స్టాక్ బాగా పుంజుకుని 6 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 4 శాతం, NDTV 2.56 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 2.55 శాతం పెరిగాయి. అదానీ విల్మార్ షేర్లు 2.15 శాతం, ఏసీసీ (1.93 శాతం), అదానీ పవర్ (1.74 శాతం), అదానీ పోర్ట్స్ (1 శాతం), అంబుజా సిమెంట్స్ (0.43 శాతం) చొప్పున పెరిగాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్వల్పంగా తగ్గింది.
సోమవారం ఇంట్రా-డే ట్రేడ్‌లో, సెబీ చైర్‌పర్సన్ మధాబి పూరీ బుచ్, ఆమె భర్త వినోద్, అదానీ తమ్ముడికి చెందిన సంస్థల్లో పెట్టుబడులు ఉన్నాయని పేర్కొంది. ఆ సంస్థలు బెర్ముడా, మారిషస్‌లోని అస్పష్టమైన ఆఫ్‌షోర్ ఫండ్‌లలో పెట్టుబడులు ఉన్నాయని US షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించడంతో గ్రూప్ సంస్థలు నష్టాలను ఎదుర్కొన్నాయి.
అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయకుండా సెబీ చైర్‌పర్సన్ బుచ్ అడ్డుపడుతున్నారని హిండెన్‌బర్గ్ శనివారం సాయంత్రం ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను బుచ్, అదానీ గ్రూప్ ఖండించాయి. బుచ్, ఆమె భర్త హిండెన్‌బర్గ్ తాజా నివేదికను సెబీ విశ్వసనీయతపై దాడిగా పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేసాయి.
బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ ఆదివారం ఒక సంయుక్త ప్రకటనలో విడుదల చేస్తూ.. 2015లో పెట్టుబడులు ఉన్నాయిని తెలిపారు. తరువాత 2017లో సెబీకి పూర్తికాల సభ్యురాలిగా ఆమె నియామకం జరగిందని, ఆ తర్వాత మార్చి 2022లో చైర్‌పర్సన్‌గా ఎదగడానికి ముందు, "ప్రైవేట్‌గా" సింగపూర్‌లో నివసిస్తున్న పౌరులనమని" పేర్కొన్నారు. అదానీ గ్రూప్ ఆదివారం హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ను తాజా ఆరోపణలను దురుద్దేశపూరితమైనది, పబ్లిక్ సమాచారాన్ని తారుమారు చేసేదిగా పేర్కొంది, సెబీ చైర్‌పర్సన్ లేదా ఆమె భర్తతో తమకు ఎటువంటి వాణిజ్య సంబంధాలు లేవని పేర్కొంది.


Read More
Next Story