మీ వల్లే కార్యకలాపాలు నిలిపేస్తున్నాం: ఆప్గన్ ఎంబసీ
ఢిల్లీలోని తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ఆప్గన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. తమకు అటూ ఆప్గన్ తాలిబన్ ప్రభుత్వం, ఇటూ భారత్ నుంచి విపరీతమైన ఒత్తిడి రావడంతో ఈ నిర్ఱయం తీసుకున్నట్లు ప్రకటించింది.
మా అధికారులకు భారత్ నుంచి సరైన లభించడం లేదని, దౌత్యపరమైన ఆసక్తి న్యూఢిల్లీకి లేదని వారు ఆరోపించారు. సెప్టెంబర్ 30 న అధికారికంగా ఎంబసీ కార్యకలాపాలను నిలిపివేసినట్లు వెల్లడించింది. భారత్, ఆఫ్గనిస్తాన్ మధ్య ఉన్న చారిత్రక, ద్వైపాక్షిక సంబంధాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో వారు వెల్లడించారు. దీనికి తాము ఎంతో చింతిస్తున్నామని వారు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
దేశంలో ఉన్న దౌత్యవేత్తలకు ఇంకా ఎనిమిది వారాల వీసా గడువు ఉందని, అయితే వీసా పొడిగింపుకు సంబంధించి భారత్ నుంచి ఎలాంటి హామీ లభించలేదని ఆప్గాన్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇది మాకు ఎంతో క్లిషమైన అంశమని, అయితే పూర్తి అధికారాన్ని భారత్ కు అప్పగించే వరకూ తమ దేశ పౌరులకు సంబంధించిన అత్యవసర సేవలు కొనసాగుతాయని వెల్లడించింది.
తమ కార్యాలయానికి అవసరమైన సిబ్బంది, ఇతర వనరులను న్యూఢిల్లీ చూసిచూడనట్లు వ్యవహరిస్తోందని ఆ ప్రకటనలో ఆరోపించింది. దేశంలో నివసిస్తున్న ఆప్గన్ పౌరులకు రాయబార కార్యాలయం కృతగ్నతలు తెలిపింది. కాబూల్ లో చట్టబద్దమైన ప్రభుత్వం లేనప్పుడు తాము అవిశ్రాంతంగా పనిచేసినట్లు చెప్పారు. 1961 నాటి వియన్నా ఒప్పందాన్ని భారత్ అమలు చేయాలని కోరింది.
రాయబార కార్యాలయానికి ప్రస్తుత రాయబారీ ఫరీద్ మముంద్ జాయ్ నేతృత్వం వహించారు. ఈయనను అప్పటి అధ్యక్షుడు అష్రఫ్ గనీ నియమించారు. 2021లో కాబూల్ లో తాలిబన్ పాలన మొదలైన తరువాత ఈయనే ఇండియాలో రాయబారీగా కొనసాగుతున్నారు.
అయితే ఈ సంవత్సరం ఏప్రిల్- మే లో తాలిబన్లు తననే రాయబారీగా నియమించారని దేశంలోని ఆప్గాన్ రాయబార కార్యాలయంలో ట్రేడ్ కౌన్సిలర్ గా వ్యవహరిస్తున్న ఖాదిర్ షా తానే ఇన్ చార్జీ అంటూ భారత రాయబార కార్యాలయానికి లేఖ రాశారు. అయితే ఇప్పటి వరకూ తాలిబన్ ప్రభుత్వాన్ని భారత్ గుర్తించలేదు. దీనికి సంబంధించి అన్ని వివాదాలపై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందుకే రాయబార కార్యాలయం మూసివేశారని తెలుస్తోంది.