మహారాష్ట్రలో సీట్ల సర్దుబాటుపై కుదిరిన ఒప్పందం..
x

మహారాష్ట్రలో సీట్ల సర్దుబాటుపై కుదిరిన ఒప్పందం..

మహారాష్ట్రలో ప్రతిపక్ష ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు ఒప్పందం కుదిరింది. శివసేన (యుబిటి) 21, కాంగ్రెస్ 17, ఎన్‌సిపి (ఎస్‌పి) 10 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.


మహారాష్ట్రలో ప్రతిపక్ష ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలోని శివసేన (యుబిటి) 21 లోక్‌సభ స్థానాల్లో, కాంగ్రెస్ 17, ఎన్‌సిపి (ఎస్‌పి) 10 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.
రాష్ట్రంలో ఏప్రిల్ 19 నుంచి మే 20 వరకు ఐదు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. NCP (SP) చీఫ్ శరద్ పవార్, శివసేన (UBT) నాయకుడు ఉద్ధవ్ థాకరే , రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ముంబైలో సమావేశమై రాష్ట్రంలోని 48 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికల పొత్తును ప్రకటించారు.
భివాండి, సాంగ్లీ స్థానాలు ఎవరికంటే..
శివసేన (UBT) ముంబైలోని నార్త్ వెస్ట్, సౌత్ సెంట్రల్, సౌత్, సౌత్ ఈస్ట్‌లతో సహా నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుంది. కాంగ్రెస్‌కు మిగిలిన రెండు, నార్త్, నార్త్ సెంట్రల్‌లో పోటీ చేయనుంది.
మిత్రపక్షాల మధ్య వివాదానికి కారణమైన భివాండి, సాంగ్లీ స్థానాలు వరుసగా ఎన్సీపీ(ఎస్పీ), శివసేన (యూబీటీ)కి దక్కాయి. మూడు మిత్రపక్షాలు ఈ సీట్లపై సందిగ్థం నెలకొంది. థాకరే మార్చి చివరి వారంలో సాంగ్లీతో సహా 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
ఆ తర్వాత ప్రకాష్ అంబేద్కర్ వంచిత్ బహుజన్ అఘాడి ఇండియా బ్లాక్ నుంచి బయటకు వచ్చి ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
ఒకే లక్ష్యం..
సమస్య పరిష్కారమైంది. 'బీజేపీని తరిమి కొట్టడమే లక్ష్యం. ఇందుకోసం ఐక్యంగా కృషి చేస్తాం' అని అని పటోల్ తెలిపారు.
"మనం కలిసి ముందుకు సాగాల్సిన సమయం వచ్చేసింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ ఒప్పందానికి వచ్చాం. ఇప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు" అని థాకరే అన్నారు.తమ వాటా సీట్లకు సంబంధించి మిగిలిన అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని పవార్ చెప్పారు.
Read More
Next Story