తొలివిడతగా 16 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన అన్నాడీఎంకే
x

తొలివిడతగా 16 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన అన్నాడీఎంకే

తొలిజాబితాలో 16 మంది పేర్లను ప్రకటించింది అన్నాడీఎంకే. మిగతా స్థానాలకు అభ్యర్థులను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.


తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 39 లోక్ సభ స్థానాలకు తొలివిడతగా 16 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ సారి కొత్త వారికి అవకాశం కల్పించినట్లుంది. ప్రధానంగా యువతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి విడుదల చేసిన జాబితాలో మాజీ ఎంపీ జే జయవర్ధన్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పీ శరవణన్ పేర్లు ఉన్నాయి. మరికొందరు పార్టీలోని వివిధ సీనియర్ ఆఫీస్ బేరర్లు.

ఏఐఏడీఎంకేకు ఐదు సీట్లు, దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజ్ఘం (డీఎండీకే)కి ఐదు, పుతియా తమిళ్‌గం (పీటీ), సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ)కి ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. తెన్కాసిలో పిటి తన సొంత చిహ్నంతో పోటీ చేయనుండగా, డిండిగల్‌లో నిషేధిత పిఎఫ్‌ఐకి అనుబంధంగా ఉన్న ఎస్‌డిపిటి కూడా పోటీ చేస్తుంది.


అన్నాడీఎంకే పార్టీ తరుపున చెన్నై (నార్త్) నుంచి ఆర్ మనో, చెన్నై (దక్షిణ) నుంచి డాక్టర్ జె జయవర్ధన్, మధురై నుంచి డాక్టర్ పి శరవణన్ బరిలో నిలుస్తున్నారు.

Read More
Next Story