అల్లు అర్జున్ ఏ 11
x
Allu Arjun in Pushpa 2

అల్లు అర్జున్ ఏ 11

తొక్కిసలాట ఘటన అల్లుఅర్జున్ ను ఇంకా వెంటాడుతునే ఉంది.


పోయిన ఏడాది డిసెంబర్ 4వ తేదీన పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా ఒక థియేటర్లో తొక్కిసలాట ఘటన గుర్తుండే ఉంటుంది. ఆ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో అపస్మారకంలోకి వెళ్ళిపోయాడు. అప్పటినుండి చాలాకాలం ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకున్నాడు. అప్పటి(Pushpa 2 stampede) తొక్కిసలాట ఘటన సంచలనం సృష్టించింది. ఆ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు శనివారం ఛార్జ్ షీట్ దాఖలుచేశారు. మొత్తం 23మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. అందులో(Allu Arjun) అల్లు అర్జున్ ఏ 11గా పోలీసులు ప్రస్తావించారు.

థియేటర్ యాజమాన్యాన్ని ఏ1గాను ముగ్గురు మేనేజర్లు, 8 మంది అర్జున్ బౌన్సర్లను కూడా ఛార్జిషీటులో చేర్చారు. వీళ్ళతో పాటు నలుగురు సాక్ష్యులను కూడా ఛార్జ్ షీట్లో చేర్చారు. అప్పటి ప్రమాదంలో శ్రీతేజ్ ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది పడగా పోలీసులే చొరవచూపించి ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటినుండి అబ్బాయి అనారోగ్యంగానే ఉన్నాడు. చాలాకాలం ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నా పెద్దగా పురోగతి కనబడలేదు. ప్రాణాపాయం తప్పిందన్న కారణంతో డాక్టర్లు అబ్బాయిని డిస్చార్జ్ చేశారు.

అబ్బాయి వైద్య ఖర్చులకు అల్లుఅర్జున్ రు. 75 లక్షలు సాయం అందించగా నిర్మాత దిల్ రాజు అబ్బాయి తండ్రి బ్యాంకు ఖాతాలో రు. 2 కోట్లు డిపాజిట్ చేశాడు. అప్పటి దెబ్బకు శ్రీతేజ్ ఇప్పటికీ మాట్లాడలేకపోవటమే కాకుండా నడవలేకపోతున్నాడు. తొక్కిసలాట ఘటనలో అల్లుఅర్జున పై కేసు నమోదుచేసిన పోలీసులు అరెస్టు చేసి కోర్టు ద్వారా రామాండుకు పంపిన విషయం గుర్తుండే ఉంటుంది.

Read More
Next Story