ఆంధ్రా కుర్రాడు వంశీ సంచలనం! ఒకే ఓవరు 6 సిక్సులు.. బాదుడే బాదుడు!!
ఆంధ్రా కుర్రాడు వంశీ కృష్ణ దుమ్మురేపాడు. దేశవాళీ క్రికెట్ లో సంచలనం నమోదు చేశాడు. కడపలో జరిగిన సీకే నాయుడు ట్రోఫీలో అద్భుత రికార్డు సృష్టించారు..
ఆంద్రా యువ క్రికెటర్ వంశీ కృష్ణ సంచలనం సృష్టించారు. ఒకే ఓవర్ లో ఆరు సిక్సులు కొట్టి రికార్డు సృష్టించారు. కడపలో జరిగిన కల్నల్ CK నాయుడు ట్రోఫీ మ్యాచ్ లో వంశీ కృష్ణ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ ను చితకబాదేశారు. ఓకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టాడు. అండర్-23 మ్యాచ్‌లో ఆంధ్ర బ్యాటర్ వంశీ కృష్ణ ఈ రికార్డు సాధించారు. రైల్వేస్‌పై ఆంధ్రా తరఫున ఆడిన వంశీ కృష్ణ 64 బంతుల్లో 110 పరుగులు చేశాడు.
BCCI టోర్నమెంట్‌లో ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన ఆంధ్ర బ్యాటర్ వంశీ కృష్ణ ఒకరే. దేశవాళీ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. కడపలో జరిగిన కల్నల్ సికె నాయుడు ట్రోఫీ (అండర్-23) మ్యాచ్‌లో రైల్వేస్‌పై ఆంధ్రా తరఫున వంశీ కృష్ణ ఆడారు. అతని బ్యాటింగ్ ముందు దమన్ దీప్ సింగ్ స్పిన్ ఎందుకు కొరగాకుండా పోయింది. దమన్ వేసిన ఓవర్‌లో 6 సిక్సర్లు బాదేశారు. వంశీ కృష్ణ ఈ అరుదైన ఫీట్ ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) బుధవారం (ఫిబ్రవరి 21) X (ట్విట్టర్)లో షేర్ చేసింది. అతని క్రీడా స్ఫూర్తిని ప్రశంసించింది.
“ఒకే ఓవర్ లో 6 సిక్స్‌లు! వావ్.. కడపలో జరిగిన కల్నల్ సి కె నాయుడు ట్రోఫీలో ఆంధ్రా ఆటగాడు వంశీ కృష్ణ రైల్వేస్ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ వేసిన ఒక ఓవర్ లో ఆరు బంతుల్ని ఆరు సిక్సర్లుగా మలచడంతో పాటు 64 బంతుల్లో 110 పరుగులు చేశారు. ఆ కుర్రాడు అద్బుత హిట్‌లతో మళ్లీ జీవం పోశాడు” అని బీసీసీఐ పేర్కొంది. అంతే కాకుండా అతని ప్రతిభకు అద్దం పట్టేలా బీసీసీఐ తన వీడియోకి ‘బీసీసీఐ డొమెస్టిక్’ హ్యాండిల్‌లో ఆమేరకు ‘ఒకే ఓవర్ లో 6 సిక్సులు.. ఓ హెచ్చరిక’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
భారతీయ దేశవాళీ క్రికెట్‌లో ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్‌మెన్ రవిశాస్త్రి. ఇటీవల, విజయ్ హజారే ట్రోఫీలో రుతురాజ్ గైక్వాడ్ ఒక ఓవర్‌లో ఏడు సిక్సర్లు కొట్టాడు.
2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన ICC వరల్డ్ ట్వంటీ-20 ఛాంపియన్‌షిప్‌లో ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన మరో భారతీయుడు. యువరాజ్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించారు.
ఇక, అంతర్జాతీయ క్రికెట్‌లో 2007లో కరేబియన్ ఐలాండ్స్ లో జరిగిన ప్రపంచ కప్ పోటీలో దక్షిణాఫ్రికాకు చెందిన హెర్షెల్ గిబ్స్ ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన మొదటి బ్యాట్స్ మెన్.
ఇంగ్లీష్ కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన మొట్టమొదటి బ్యాటర్ సర్ గారీఫీల్డ్ సోబర్స్. సోబర్స్.. 1968లో గ్లామోర్గాన్‌తో నాటింగ్‌హామ్‌షైర్ తరపున ఆడుతున్నప్పుడు మాల్కం నాష్‌పై ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.
ఈ ఘనత సాధించిన ఇతర క్రికెటర్లలో కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్), తిసార పెరీరా (శ్రీలంక), లియో కార్టర్ (న్యూజిలాండ్), జస్కరన్ మల్హోత్రా (అమెరికా), హజ్రతుల్లా జజాయ్ (ఆఫ్ఘనిస్థాన్), రాస్ విట్లీ (ఇంగ్లండ్) ఉన్నారు.