ఆంధ్రాలో ప్రతి గవర్నమెంట్ స్కూల్ కు ఇక ముందు రేటింగ్...
x

ఆంధ్రాలో ప్రతి గవర్నమెంట్ స్కూల్ కు ఇక ముందు రేటింగ్...

శాసనమండలిలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్


అమరావతి:

రాష్ట్రంలో ప్రతిపాఠశాలకు 40 శాతం పాఠశాలలు అధ్వాన్నంగా ఉన్నాయని వాటిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.

ఈ రోజు పాఠశాల పరిస్థితుల మీద కొందరు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ప్రతి పాఠశాలకు ఇస్తున్న రేటింగ్ గురించి చెప్పారు.

పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని తాను చెప్పానని ఆప్రకారంగా 18 అంశాలపై స్టార్ రేటింగ్ ఇస్తే . సుమారు 40 శాతం పాఠశాలలు 2స్టార్ కంటే తక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. వీటిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని చెబుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ.7,500 కోట్లు ఖర్చుపెట్టాల్సిన అవసరం ఉందని లోకేశ్ చెప్పారు.

2020 నుంచి 2026 వరకు ఆర్థిక సంవత్సరాల వారీగా మనబడి నాడు- నేడు, మనబడి -మన భవిష్యత్ పథకాల కింద ఖర్చు చేసిన నిధుల వివరాలు, ఆయా పథకాల కింద పూర్తిగా అభివృద్ధి చేసిన, ఇంకా అభివృద్ధి చేయాల్సిన పాఠశాలల వివరాలపై సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, టి.కల్పలత, ఎంవీ రామచంద్రారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ ఆయన స్పందించారు.

చిత్తూరు జిల్లాల స్కూళ్ల పరిస్థితి

"క్రిటికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ చాలా ముఖ్యం. నేను చిత్తూరు పర్యటకు వెళ్లినప్పుడు కొన్ని పాఠశాలల్లో లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ లేవు, పేయింటింగ్, బేసిక్ బెంచెస్, ఫర్నిచర్స్ లేవు. ముందు లీక్ ప్రూవ్ బిల్డింగ్స్, బెంచ్ లు, పెయింటింగ్, ఫర్నిచర్, వాటర్, టాయిలెట్స్ అందించాలనేది మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. పాఠశాలల్లో పెండింగ్ వర్క్స్ ఎక్కడ ఉన్నాయో మొత్తం సమీక్ష చేస్తున్నాం. జీవో 117కు ప్రత్యామ్నాయంగా మోడల్ ప్రైమరీ స్కూల్స్ కింద తరగతికో ఉపాధ్యాయుడు విధానాన్ని తీసుకువచ్చాం. గతంలో కేవలం 3 శాతం పాఠశాలల్లో తరగతికో ఉపాధ్యాయుడు ఉంటే.. ఇప్పుడు 33 శాతానికి తీసుకువచ్చాం. దీనివల్ల కొన్ని పాఠశాలల్లో ఎక్కువ తరగతి గదుల అవసరం ఉంది. వీటన్నింటిని పరిశీలించి మేం ముందుకు వెళ్తాం. గతంలో నాడు-నేడు కింద అభివృద్ధి చేసిన 233 పాఠశాలలు మూసివేయడం జరిగింది. నిధులు అనవసరంగా వృధా చేయకూడదు. ఎక్కడ అవసరమో అక్కడ అభివృద్ధి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ పైనా దృష్టి సారించాం. 2019 నంచి 2024 వరకు లెర్నింగ్ అవుట్ కమ్స్ లో వెనుకబడ్డాం," అని ఆయన చెప్పారు.

నాడు-నేడు కింద రూ.500 కోట్లు బకాయిలు చెల్లించాం

వైసీపీ హయాంలో నాడు-నేడుపై చిత్తశుద్ధి ఉంటే పెండింగ్ బిల్లులు ఎందుకు చెల్లించలేదని ఆయన అన్నారు. బిల్లులు చెల్లించి ఉంటే ఇబ్బంది ఉండేది కాదని అంటూ కూటమి ప్రభుత్వంలో రూ.500 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించడం జరిగిందని ఆయన వెల్లడించారు.

‘‘ఈ వివరాలన్నీ గత అసెంబ్లీ సెషన్స్ లో విద్యారంగంపై లఘు చర్చలో వెల్లడించాం. వైసీపీ వాకౌట్ చేయకుండా హౌస్ లో ఉంటే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవాడిని. వాకౌట్ చేశారు కాబట్టి మీకు సబ్జెక్ట్ తెలియడం లేదు. వైసీపీ హయాంలో అద్భుతంగా పనిచేస్తే లెర్నింగ్ అవుట్ కమ్స్ ఎందుకు పడిపోయాయి? ఎఫ్ఎల్ఎన్ (Foundational Literacy and Numeracy:FLN) చూస్తే.. 84.3 శాతం మూడో తరగతి, 62.5 శాతం ఐదో తరగతి, 47 శాతం 8వ తరగతి విద్యార్థులు రెండో తరగతి పాఠ్య పుస్తకాలను చదవలేకపోయారు. అందుకే ఏఐ టూల్ ద్వారా గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ చేపట్టాం. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతాము,’’ అని చెప్పారు.

Read More
Next Story