ఆస్ట్రేలియాలో మరోసారి జాత్యహంకార దాడి
x

ఆస్ట్రేలియాలో మరోసారి జాత్యహంకార దాడి

ఆస్ట్రేలియాలో మరోసారి జాతి విద్వేషం పెచ్చరిల్లి భారత సంతతి విద్యార్థిపై దాడి జరిగింది. ఈ ఘటనలో బాధితుడు అక్కడిక్కడే కుప్పకూలాడు. ప్రస్తుతం అతడు కోమాలో ఉన్నాడు. మెదడు లోపల తీవ్రంగా రక్తస్రావం జరగడంతో అచేతన స్థితిలోకి వెళ్లిపోయిందని, కుడి ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయాయయని సిడ్నీకి చెందిన స్పెషల్ బ్రాడ్ కాస్టింగ్ సర్వీస్ వెల్లడించింది.


బాధిత విద్యార్థి యూనివర్శిటీ ఆఫ్ టాస్మానియాలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. అతడి వయస్సు కేవలం 20 సంవత్సరాలని తేలింది. ఈ ఘటనలో ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు లోనా లోయ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల బెంజమిన్ డాడ్జ్ కాలింగ్స్ గా గుర్తించారు. ఇతడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి కోర్టులో సరెండర్ చేశారు. కాలింగ్స్ పై తప్పుడు చిరునామా అందించడం, పోలీస్ అధికారులపై దాడి, డ్రైవింగ్ నేరాలపై పలు అభియోగాలు నమోదు చేశారు. డిసెంబర్ 4 కోర్టుకు హాజరు కావాలనే షరతుతో న్యాయస్థానం కాలింగ్స్ కు బెయిల్ మంజూరు చేసింది. నేరం రుజువైతే కాలింగ్స్ కు గరిష్టంగా 21 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ ఘటనపై వైద్యుల స్పందించారు. బ్రెయిన్ లోపల జరుగుతున్న రక్త స్రవాన్ని ఆపడానికి సర్జరీ చేయాల్సి వచ్చిందని, దీనికోసం చాలా గంటలు శ్రమించాల్సి వచ్చిందని వెల్లడించారు. బాధితుడి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు చెప్పారు.

ఈదాడి ఘటనపై టాస్మానియా యూనివర్శిటీ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ బెన్ వైల్డ్ స్పందించారు. ఈ విషయం తమకు, విశ్వవిద్యాలయ ఉన్నత అధికారులకు తెలుసని వెల్లడించారు. ఈ క్లిష్ట సమయాల్లో విద్యార్థికి సహాయం చేయడానికి విశ్వవిద్యాలయం ఎలాంటి చర్యలు తీసుకుందని మీడియా ప్రశ్నించినప్పుడు,‘ బాధిత కుటుంబంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, కేసుకు ప్రత్యేక మేనేజర్‌ను కేటాయించారని బెన్ వైల్డ్ చెప్పారు. ప్రస్తుుతం కేసుకు సంబంధించిన అంశం కోర్టు పరిధిలోకి వెళ్లిందని ఇక మేము చేసేదిగా పరిమితంగానే ఉంటుందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

Read More
Next Story