వృద్ధాప్య పెన్షన్.. దేశంలో నేనే నెంబర్ వన్..
x
at kakinada

వృద్ధాప్య పెన్షన్.. దేశంలో నేనే నెంబర్ వన్..

'అధికారం కోసం కుటుంబాల్లో చిచ్చు పెట్టేవాళ్లు వస్తారు. తస్మాత్ జాగ్రత్త. ఆ దత్త తండ్రీ, ఈ దత్తపుత్రుడు కలిసి ఏదో చేస్తారట'


"ఎన్నిక‌ల్లో ఇచ్చిన మాట ప్ర‌కారం పెన్షన్ రూ.3 వేలకు పెంచాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా 66.34 లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్‌ అందిస్తున్నాం. పెన్షన్‌ల కోసం దాదాపుగా నెలకు రూ. 2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పండుగైనా, సెలవైనా ఒకటో తేదీనే పెన్షన్‌ అందిస్తున్నాం" అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కాకినాడలో.

నెలకు రూ.2 వేల కోట్లు ఖర్చు...


"పెద్ద వయసు ఉన్నవారు, విధి రాత వల్ల తమకు తాము పోషించుకోలేని పరిస్థితిలో అక్షరాల 64 లక్షల 34 వేల మంది ఉన్నారు. నేడు ఆ అభ్యాగులకు, వితంతువులకు మంచి చేస్తూ సామాజిక పెంఛన్‌ను అక్షరాల రూ.3 వేలకు పెంచాం" నెలకు అక్షరాల దాదాపుగా రూ.2 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్న పరిస్థితిలో ఒక్కసారి గతానికి అంటే ఐదేళ్ల క్రితం పరిస్థితి గమనించాలి. అప్పట్లో చంద్రబాబు పరిపాలనలో ఎన్నికలకు రెండు నెలల ముందు కూడా పింఛన్‌ కేవలం రూ.1000 మాత్రమే ఇచ్చాడని ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ఆనాడు కూడా ఆ ఎన్నికలకు రెండు నెలల ముందు పింఛన్‌ రూ.2 వేలు చేశాడని,ఎన్నికలు రాకపోయి ఉంటే..మీ బిడ్డ జగన్‌ రూ.2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే ఆ పింఛన్‌ పెంచేవాడా? " అని సీఎం ప్రశ్నించారు. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో అక్షరాల రూ.1.47 లక్షలు ఇచ్చామని తెలిపారు. వికలాంగులను లెక్కల్లో వేసుకుంటే వారికి రూ.1.82 లక్షలు ఇచ్చామని, గతానికి ఇప్పటికి మధ్య తేడా గమనించాలని సీఎం కోరారు.

పెన్షన్ కోసం లంచాలిచ్చేపరిస్థితి నేడు లేదు...


"గతంలో పింఛన్‌ కావాలంటే పడిగాపులు పడాలి, జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఒకవైపు లంచాలు, మరోవైపు వివక్ష, మరో వైపు చెంతాడంత క్యూలైన్లు, ఈ రోజు ఎవరికి పింఛన్‌ కావాలన్నా అర్హత ఉంటే చాలు మంజూరు చేస్తున్నాం" అని సీఎం స్పష్టం చేశారు. "చంద్రబాబు అవినీతిలో పవన్‌ కల్యాణ్‌ కూడా భాగస్వామి. చంద్రబాబు అవినీతిపై పచ్చ మీడియా ఏమీ రాయవు, చూపించవన్నారు" ఐదేళ్లు గతంలో సీఎంగా ఉన్న ఒకాయనకు ఒక దత్తపుత్రుడు ఉన్నాడని, ఆ ఇద్దరు కలిసి 2014లో ఎన్నికల ప్రణాళికలో వాళ్లు చెప్పిన మాట ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం, అందులో ఇళ్లు కట్టిస్తామని వాగ్ధానం చేశారని, చివరకు ఒక్క సెంట్‌ కూడా ఇవ్వలేదని సీఎం గుర్తు చేశారు.

పవన్ కల్యాణ్ పై పరోక్ష విమర్శలు..

చంద్రబాబు అవినీతిని కేంద్ర దర్యాప్తు సంస్థలు నిర్ధారించి న్యాయస్థానం జైలుకు పంపిందని, జైల్లో ఉన్న అవినీతిపరుడు చంద్రబాబును దత్తపుత్రుడు పవన్ పరామర్శిస్తాడని. అవినీతికి తావులేకుండా పాలన చేస్తున్న మన ప్రభుత్వంపై విమర్శలు చేస్తాడని, చంద్రబాబు అవినీతిలో భాగస్వామి కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించడని విమ‌ర్శించారు. ఈబీసీ నేస్తం ద్వారా రూ.1252 కోట్లు నా నిరుపేద అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాను. ఆగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.905 కోట్లు ఇచ్చాం. జగనన్న తోడు ద్వారా రూ.2,955 కోట్లు, జగనన్న చేదోడు ద్వారా రూ.1250 కోట్లు ఇచ్చాం. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్‌ చెంతాడంత ఉంటుంది. ఆలోచన చేయండి. ఎక్కడైనా కూడా లంచాలు, వివక్ష లేదు. ప్రతిదీ కూడా గ్రామ పంచాయతీలో లిస్టు పెడుతున్నాం. వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి తోడుగా నిలబడుతున్నాడు. నేరుగా డబ్బులు పంపిస్తున్న ప్రభుత్వం మీ బిడ్డ పాలనలోనే జరుగుతుంది. ప్రతి విషయం కూడా ఆలోచన చేయాలి" అన్నారు జగన్మోహన్ రెడ్డి.

Read More
Next Story