ఈవీల కోసం బడ్జెట్ లో పెద్ద పీట వేస్తారా?
x

ఈవీల కోసం బడ్జెట్ లో పెద్ద పీట వేస్తారా?

ఈవీ వాహనాల కోసం వచ్చే నెలలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో మెరుగైన విధానాలు ఉండాలని మార్కెట్ వర్గాలు కోరుకుంటున్నాయి. ఇప్పటికే చైనా, యూరప్ ఈ రంగంలో దూసుకుపోతున్నాయి


ప్రపంచ వ్యాప్తంగా ఈవీ వాహానాల జోరు క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ సాంకేతికతో తయారైన వాహానాలు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. దీనివల్ల వాతావరణ కాలుష్యం తగ్గడంతో పాటు ప్రభుత్వంపై పెట్రో దిగుమతులపై భారం భారీగా తగ్గుతుంది. మనదేశంలో యువత అధిక సంఖ్యలో ఉండటం ఈవీ మార్కెట్ పెంచుకోవడానికి కలిసొచ్చే అంశం. కొత్త సాంకేతిక ఏదీ వచ్చిన దాన్ని విజయవంతం చేసేది యువత మాత్రమే.

కేంద్రం ప్రభుత్వం కూడా ఈవీ పై రంగం దృష్టి పెట్టింది. 2030 నాటికి మొత్తం వాహానాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు 30 శాతం ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ఈవీ పాలసీని ప్రవేశపెట్టింది. వీటికి తాజాగా ప్రవేశపెట్టే బడ్జెట్ లో పెద్ద పీట వేయాల్సి ఉంటుంది.
ప్రస్తుత విధానం కొంత మేరకు పనిచేసింది. EV షేర్ 2023లో 6.3 శాతానికి చేరుకుంది. వూహాన్ వైరస్ కంటే ముందు ఇది మొత్తం వాహానాల్లో కేవలం 1 శాతం మాత్రమే ఉండేది. (EV అమ్మకాలు 2022లో 1.02 మిలియన్ల నుంచి 2023లో దాదాపు 1.4 మిలియన్లకు పెరిగాయి). ఈవీ వాహానాలు వాటా పెరగడానికి ప్రభుత్వం దాదాపు రూ. 600 మిలియన్లకు పైగా సబ్సిడీలను అందించింది. ప్రస్తుతం ఉన్న ఈవీ వాటాను వచ్చే దశాబ్ధంలో భారీగా పెంచడానికి ఈ సబ్సీడీల శాతాన్ని పెంచడానికి అభివృద్ధి చెందిన విధానం అవసరం.
చాలా ముందున్న చైనా, యూరప్
ప్రస్తుతం అందుతున్న గణాంకాల ప్రకారం చైనా ఈవీ రంగంలో చాలా మందుంది. 2022 నాటి డేటాను ఒకసారి పరిశీలిస్తే కొత్తగా విక్రయించిన కార్లలో ఈవీల వాటా ఏకంగా 22 శాతంగా ఉంది. అది విద్యుద్ధీకరణలో చాలా ముందుంది. వీటికి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ చేర్చినప్పుడు సంబంధిత సంవత్సరంలో వీటి శాతం 30 కి చేరుతుందని అంచనా. యూరప్‌లో, కొత్తగా నమోదైన వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వాటా 23 శాతం ఉందని ఓ అధ్యయనం తెలిపింది.
‘FAME’ పాలసీ
మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహానాల కోసం FAME 2 పాలసీని ప్రకటించింది. ఈవీ వాహానాల తయారీ, ఉత్పత్తి, అనుసంధాన ప్రొత్సాహాక పథకాలకు రూ. 18,100 కోట్లు కేటాయించింది. దీనితో ఈ రంగానికి బలమైన పునాదిని ఏర్పాటు చేసినట్లు అయింది. అదనంగ ఆధునాతన బ్యాటరీల కోసం 26,000 కోట్లు కేటాయించింది.
EV ప్రోత్సాహక కార్యక్రమం కోసం మూడవ ఎడిషన్, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME)ని రాబోయే యూనియన్ బడ్జెట్‌లో ఆమోదించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. కొత్త ఈవీ విధానం ఎలక్ట్రిక్ వాహనాల కార్యక్రమాన్ని వేగవంతం చేసినప్పటికీ, ఈ రంగం విజయవంతం కావాలంటే ప్రభుత్వం పథకాలు ఒక్కటే సరిపోవు. వాటికి కూడా పరిమితి ఉంటుంది.
1. పరిమిత పరిధి, కవరేజ్:
FAME పథకం దేశం మొత్తం అవసరమైన బడ్జెట్ ను అందించలేదు. ఇది పరిమితమైన వనరులను మాత్రమే సమకూర్చగలదు. దీనివల్ల ప్రణాళిక కంటే తక్కువ వాహనాలకు మాత్రమే సబ్సీడీను అందించగలదు.
2. మౌలిక సదుపాయాల లోపాలు
EV వాహానాలకు ఉన్న ఒక ముఖ్యమైన అవరోధం తగినంత ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడం. ఈ పథకం వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈవీ వాహానాలను కొనుగోలు చేస్తే తప్పనిసరిగా ఛార్జింగ్ స్టేషన్లు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఇది పరిమిత బడ్జెట్ వనరులున్న నేపథ్యంలో ఎలా పరిష్కారం లభిస్తుందో ఇప్పుడిప్పుడే చెప్పలేము.
3. అస్థిరమైన విధానం
రాష్ట్ర, కేంద్ర స్థాయిలో విధానాల అమలులో అసమానతలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలు EV మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాల కోసం వివిధ స్థాయిల్లో నిబద్ధత, మద్దతును అందిస్తామని ప్రకటించాయి. దీనివల్ల అసమాన వ్యవస్థ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ప్రతి రాష్ట్రానికో విధానం కాకుండా ఏకమొత్తం లో ఒక్క విధానం ఉండటం మేలు చేస్తుంది.
4. సబ్సిడీ పంపిణీ సమస్యలు
తయారీదారులు, వినియోగదారులకు సబ్సిడీలను పంపిణీ చేయడంలో జాప్యం కావడం వల్ల కొత్త సమస్యలు, అనిశ్చితిని సృష్టిస్తాయి. దీనివల్ల వినియోగదారులు కొత్త తరహ వాహానాల వినియోగానికి ఇష్టపడరు.
5. ప్రారంభ ఖర్చులు
సబ్సిడీలు ఉన్నప్పటికీ, సాంప్రదాయ వాహనాలతో పోలిస్తే ఈవీ వాహనాలు ధరలు బాగా ఉన్నాయి. ఇది చాలా మంది వినియోగదారులను నిరాశపరిచింది. ఈ మధ్య విడుదలైన ఓ ఈవీ కారు తన కారు ధరను ఏకంగా మార్కెట్లో లభించే పెద్ద కారు ధరతో సమానంగా ప్రకటించింది. దానికి తోడు ఐదు సంవత్సరాల తరువాత బ్యాటరీ మార్చాల్సి ఉంటుందని వివరించింది. దాని ఖరీదే రూ. ఐదు లక్షలు అని చెప్పి షాక్ ఇచ్చింది. ఎందుకంటే కారు ధరలో 75 శాతం దాకా బ్యాటరీకే చెల్లించాలి.
6. పరిమిత అవగాహన
EVల ప్రయోజనాలు, లభ్యత గురించి వినియోగదారులకు తెలియదు. వాటి పనితీరు, పరిధి, నిర్వహణ గురించి ఆందోళన చెందారు. వీటిపై వీలైనంత ఎక్కువ సమాచారం బయటకు రావాలి. అందుకు తగిన ఏర్పాటు చేయాలి.
7. స్థానిక తయారీకి తగినంత మద్దతు లేదు
ఈ విధానం స్థానికంగా తయారీని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, బ్యాటరీల వంటి ముఖ్యమైన భాగాలపై అధిక దిగుమతి సుంకాలతో సహా దేశీయ తయారీదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి అందించిన మద్దతు సరిపోలేదు.
8. సాంకేతిక సవాళ్లు
EV సాంకేతికత, ముఖ్యంగా బ్యాటరీ సాంకేతికత, ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది, ఇది పథకం కింద అందుబాటులో ఉన్న EVల దీర్ఘకాల సామర్థ్యం గురించి ఆందోళనలకు దారితీసింది. తాము వాహానం కొన్న తరువాత మెరుగైన సాంకేతికతతో మరో కొత్త తరం ఈవీ వస్తే వినియోగదారులు అసంతృప్తికి గురవుతారు.
9. విధాన మార్పులు, అనిశ్చితి
తరచుగా పాలసీ మార్పులు, అప్‌డేట్‌లు తయారీదారులు, వినియోగదారుల మధ్య అనిశ్చితిని సృష్టించాయి, EV రంగంలో దీర్ఘకాలికంగా ప్లాన్ చేయడం, పెట్టుబడి పెట్టడం కష్టతరం చేస్తుంది.
మార్గమేమిటీ..
ఈవీల మార్కెట్ ను త్వరితగతిన ట్రాక్ చేయడానికి ప్రభుత్వం స్థిరమైన ఫ్రేమ్ వర్క్ ను రూపొందించాలి. ఈ విధానంపై వెనక్కి వెళ్లము అనే నమ్మకాన్ని అందరికీ కలిగించాలి.
1. పన్ను ప్రోత్సాహకాలు
తక్కువ GST: EVలను మరింత చౌక ధరకు అందించడానికి, ఎలక్ట్రిక్ వాహనాలపై GST ని ప్రస్తుత 5 శాతం నుంచి తక్కువ రేటుకు తగ్గించాలి.
ఆదాయపు పన్ను ప్రయోజనాలు: EVలను కొనుగోలు చేయడానికి రుణాలపై చెల్లించే వడ్డీపై ఆదాయపు పన్ను మినహాయింపును ఇవ్వాలి.
కార్పొరేట్ పన్ను ప్రయోజనాలు: ఎలక్ట్రిక్ వెహికల్ ఫ్లీట్‌లలో పెట్టుబడి పెట్టే వ్యాపారాలు, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, EV టెక్నాలజీలో రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కోసం పన్ను మినహాయింపులను ఇవ్వాలి.
2. సబ్సిడీలు, గ్రాంట్లు
ప్రత్యక్ష రాయితీలు: EVలను కొనుగోలు చేయడానికి, ముఖ్యంగా తక్కువ, మధ్య-ఆదాయ వినియోగదారులకు ముందస్తు రాయితీలను అందించాలి.
R&D గ్రాంట్లు: బ్యాటరీ టెక్నాలజీ, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, EV కాంపోనెంట్‌లలో పరిశోధన అభివృద్ధి కోసం, కొత్త ఆవిష్కరణల ఖర్చులను తగ్గించడం కోసం తగినన్ని నిధులను కేటాయించాలి.
3. ఛార్జింగ్ అవస్థాపన
మౌలిక సదుపాయాల గ్రాంట్లు: పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ కంపెనీలకు గ్రాంట్లు అందించాలి.
భూమి కేటాయింపు: ఛార్జింగ్ స్టేషన్ల కోసం రాయితీ ధరలకు భూమిని కేటాయించాలి. వ్యూహాత్మక ప్రదేశాలలో భూమిని ఉచితంగా అందించాలి.
4. తయారీ ప్రోత్సాహకాలు:
ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్స్ (PLI): ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీల తయారీకి PLI పథకాన్ని విస్తరించి మెరుగుపరచాలి.
దిగుమతి సుంకం తగ్గింపు: తయారీ ఖర్చులను తగ్గించడానికి EVలు, బ్యాటరీల భాగాలు, ముడి పదార్థాలపై దిగుమతి సుంకాలను తగ్గించాలి.
5. FAME II పథకం మెరుగుదల
పొడిగింపు, విస్తరణ: పెరిగిన నిధులు, విస్తృత కవరేజీతో 2024 తర్వాత హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల (FAME II) స్కీమ్‌ను వేగంగా అమలులోకి తీసుకురావాలి.
6. ప్రజలకు అవగాహన, శిక్షణ:
అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లు: EVల ప్రయోజనాల గురించి పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించే ప్రచారాలకు నిధులు సమకూర్చాలి.
స్కిల్ డెవలప్‌మెంట్: EV తయారీ, నిర్వహణ, సేవల వర్క్‌ఫోర్స్‌లో నైపుణ్యం పెంచడానికి శిక్షణ కార్యక్రమాలలో పెట్టుబడి పెంచాలి.
7. నియంత్రణ
జీరో ఎమిషన్ జోన్‌లు: ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారడాన్ని ప్రోత్సహిస్తూ, EVలు మాత్రమే అనుమతించబడే ప్రధాన నగరాల్లో జీరో-ఎమిషన్ జోన్‌లను ఏర్పాటు చేయాలి.
ఆకుపచ్చ నంబర్ ప్లేట్లు: ఉచిత పార్కింగ్, టోల్ మినహాయింపులు, అధిక ఆక్యుపెన్సీ వాహన లేన్‌లకు యాక్సెస్ వంటి ప్రయోజనాలను అందించే EVల కోసం ఆకుపచ్చ నంబర్ ప్లేట్‌ల వినియోగాన్ని ప్రోత్సహించాలి.
8. ఫైనాన్స్- ఇన్సూరెన్స్
తక్కువ వడ్డీ రుణాలు: EV కొనుగోళ్ల కోసం తక్కువ వడ్డీ రుణాలను అందించడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేయాలి.
బీమా ప్రయోజనాలు: EV యజమానులకు తగ్గింపు బీమా ప్రీమియంలను అందించండి.
స్థిరమైన పాలసీలు అందించడం, ఈవీల కోసం ప్రేమ్ వర్క్ ను రూపొందించడం వల్ల ఈ రంగంలో భారత్ ను ప్రపంచ నాయకుడిగా నిలబెడుతుంది.
Read More
Next Story