x

తెలంగాణలో నిజంగానే మహిళలు కోటీశ్వరులవుతున్నారా ?

కొన్ని మహిళా సమఖ్యాలు మాత్రం కోటి రూపాయల బిజినెస్ టర్నోవర్ సాదించే స్ధాయికి ఎదిగాయి.


కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నది ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కల. 2023లో సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటినుండి రేవంత్ ఇదే మాటను చాలాసార్లు చెప్పారు. నిజంగా కోటిమంది మహిళలు కోటీశ్వరులు అవుతారో లేదో తెలీదు కాని కొన్ని మహిళా సమఖ్యాలు మాత్రం కోటి రూపాయల బిజినెస్ టర్నోవర్ సాదించే స్ధాయికి ఎదిగాయి. రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సమాఖ్యలను బాగా ప్రోత్సహిస్తోంది.

మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయటంలో భాగంగానే ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇప్పించటం, చిన్నసైజు సూపర్ బజార్లను ఏర్పాటుచేయించటం, పచ్చళ్ళు తయారీ అమ్మకాల్లాంటి అనేక వ్యాపారాలకు బ్యాంకులతో లింకేజి చేయించి రుణాలను ఇప్పిస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని మహిళా సమాఖ్యలతో పెట్రోల్ బంకులు కూడా పెట్టించింది.

తెలంగాణలో ఇప్పటికి సిద్ధిపేట, నారాయణపేట, నల్గొండలో మూడు బంకులను మహిళా సమాఖ్యలే నిర్వహిస్తున్నాయి. నాలుగో బంకు తొందరలోనే ఆదిలాబాదులో ఏర్పాటవబోతోంది. మొదటి మూడు బంకుల్లో బిజినెస్ బాగా నడుస్తోంది కూడా. మహిళా సమాఖ్యలోని సభ్యురాళ్ళే బంకుల నిర్వహణను చూసుకుంటున్నాయి. వీటి టర్నోవర్ రోజుకు తలా సుమారు రు. 10 లక్షల దాకా ఉంటోంది. ఇదే విషయాన్ని సంగారెడ్డిలోని డీఆర్డీఏ పెట్రోల్ బంకు నడుపుతున్న ఆదర్శ మహిళా సమాఖ్య లీడర్ జీ సంగీత తన అనుభవాలను తెలంగాణ ఫెడరల్ తో పంచుకున్నారు.

Read More
Next Story