చందమామని పల్కరించి వచ్చిన నాసా రోదసి వీరులు
x
పోటో సౌజన్యం నాసా

చందమామని పల్కరించి వచ్చిన నాసా రోదసి వీరులు

పది రోజుల అమెరికా అర్టిమిస్ అంతరిక్ష యాత్ర సక్సెస్


అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పంపిన నలుగురు రోదసి వీరులు చంద్ర ప్రదక్షిన ముగించుకుని కొద్ది సేపటి కిందట విజయవంతంగా భూమికి తిరిగొచ్చారు. ఈ అందరిక్ష యాత్రలో వారు గతంలో మనిషి పయనించనంత దూరం వెళ్లి వచ్చారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8.07 గంటలకు (భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 5.38 గంటలు) రీడ్ వీస్ మాన్ (commander), విక్టర్ గ్లోవర్ (pilot), క్రిస్టినా కోక్ (mission specialist), కెనాడా కు చెందిన జెరిమీ హాన్ సెన్ ( mission specialist) శాన్ డియాగో వద్ద పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా దిగారు. సుమారు ఐదు దశాబ్దాల తర్వాత చంద్రుడి చెంతకు వెళ్లి వచ్చిన మానవ సహిత నౌకగా ఆర్టెమిస్-2 రికార్డు సృష్టించింది. ఏప్రిల్ 1 న ఆర్టిమిస్ 2 ఉపగ్రహంలో ఫ్లోరిడాలోని నాసా సెంటర్ నుంచి చందమామవైపు పరుగుపెట్టింది.

నాసా నలుగురు వ్యోమగాములు వీరే

9 రోజుల ఉత్కంఠ.. అద్భుత విజయం!

చంద్రుని చుట్టి రావడానికి వెళ్లిన ఈ నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలో మొత్తం 9 రోజుల 13 గంటల 15 సెకన్ల పాటు గడిపారు. ఆకాశంలో వారు గడిపిన ప్రతి సెకను ఎంత ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఘట్టం మరీ ఉత్కంఠ రేపింది. పసిఫిక్ మహాసముద్రంలో ఓరియన్ వ్యోమనౌక సురక్షితంగా ల్యాండ్ కావడంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది.

తిరుగు ప్రయాణంలో...

తిరుగు ప్రయాణంలో భూ వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు ఓరియన్ నౌక అసలైన అగ్నిపరీక్షను ఎదుర్కొంది.కొన్ని వేల డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకుంటూ, గంటకు వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి పారాచూట్ల సాయంతో సముద్రపు అలలపై వాలింది.

ఇక చంద్రుడిపై అడుగేయడమే మిగిలింది...

ఈ ఆర్టిమిస్ మిషన్ కేవలం ఒక చంద్రదర్శన యాత్ర మాత్రమే కాదు. మనిషి భవిష్యత్తులో చంద్రుడిపై ఇళ్లు కట్టుకోవడానికి, అక్కడి నుంచి అంగారక గ్రహానికి,సుదూరవిశ్వంలోకి పయనం కావడానికి బాట వేస్తుంది.

మిషన్‌ ముఖ్య విశేషాలు..

ఓరియన్ వ్యోమనౌక సముద్రంలో దిగిన తర్వాత, వ్యోమగాములను ఒక్కొక్కరిని బయటకు తీసి, హెలికాప్టర్ ద్వారా యూఎస్ నేవీ నౌకకు తరలించారు.

భూ వాతావరణంలోకి ప్రవేశించడం క్లిష్టంగా మారింది. విపరీతమైన వేడి నుండి వ్యోమగాములను రక్షించే హీట్ షీల్డ్ రూపకల్పనలో కొన్ని లోపాలు గుర్తించారు. ఫలితంగా వారి భద్రతకోసం వ్యోమనౌక ప్రయాణ మార్గంలో మార్పులు చేసింది. ఓరియన్ క్యాప్సూల్ ని వేగంగా, నిటారుగా ఉన్న కోణంలో భూమి మీదకు పంపారు.


Read More
Next Story