అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ అభ్యర్థుల కొరత బీజేపీకి కలిసొస్తుందా?
x

అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ అభ్యర్థుల కొరత బీజేపీకి కలిసొస్తుందా?

అరుణాచల్ ప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 60 సీట్లకు గాను 25 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది. ఇది బీజేపీ కలిసొచ్చే అంశం.


అరుణాచల్ ప్రదేశ్‌లో బిజెపి దూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ మొత్తం 60 సీట్లకు గాను 25 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది. ఇక్కడ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతుంది.

ముఖ్యమంత్రి పెమా ఖండూ సహా ఐదుగురు బీజేపీ అభ్యర్థులు పోటీ లేకుండా గెలుపొందనున్నారు. వారం రోజుల్లో నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరో 30 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను నిలబెట్టకపోవడంతో కాషాయ జెండా రెపరెపలాడే అవకాశం ఉందని సమాచారం.

ఒప్పందం కుదిరిందా?

స్థానిక బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య కుదిరిన ఒప్పందం ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని సులువుగా గెలుపొందేందుకు దోహదపడుతుందని కొన్నివర్గాల సమాచారం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41 సీట్లు గెలుచుకోగా.. జేడీ(యూ) 7, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) 5, కాంగ్రెస్ 4, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) ఒకటి గెలుచుకున్నాయి. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఒక్కో స్థానంలో గెలుపొందారు. అయితే మార్చి మొదటి వారంలో మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించడంతో కాంగ్రెస్‌కు ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి నబమ్ తుకీ మాత్రమే మిగిలారు. మార్చి 22న 34 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. ‘‘మేము ఇతర స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేదు, ”అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఎ చెల్లా కుమార్ తెలిపారు.

పోటీకి దూరంగా నేతలు..

అరుణాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు సాధారణంగా ఇష్టపడరు. నవంబర్ 2016 లో పెమా ఖండూ నేతృత్వంలోని అరుణాచల్ కాంగ్రెస్ నాయకులందరూ బిజెపిలో చేరడం వల్ల నాయకుల కొరత ఏర్పడింది.

‘‘కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలందరూ 2016లో బీజేపీలో చేరారు. సరైన అభ్యర్థిని నిలబెట్టడానికి ఎవరూ లేరు” అని అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APPCC) ఉపాధ్యక్షుడు టోకో మినా అన్నారు.

అరుణాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు ఖరీదైన విషయమని స్థానిక కాంగ్రెస్ నేత ఒకరు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నిక కావడానికి అభ్యర్థి రూ. 25 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. "కాబట్టి గెలిచే అవకాశం తక్కువగా ఉన్న చోట ఎవరూ రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు," అని పేరు చెప్పడానికి ఇష్టపడని నాయకుడు చెప్పాడు.

నాగాలాండ్‌లో కూడా కనిపించే ఈ తీరు కేవలం అసెంబ్లీ ఎన్నికలకే పరిమితమైంది. అరుణాచల్ ప్రదేశ్‌లో కేవలం రెండు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటికి పోటీ చేయడం సవాలు కాదు.

బీజేపీకి 30కి పైగా..

కాంగ్రెస్‌ తరఫున 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. మార్చి 27వ తేదీ నాటికి 25 మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. “ఇక్కడ పరిస్థితి గురించి నాకు తెలియదు. నేను నిన్ననే బాధ్యతలు స్వీకరించాను. మీరు దాని గురించి టుకీతో మాట్లాడవచ్చు. కాని టుకీ కూడా వ్యాఖ్యానించడానికి అందుబాటులో లేరు” అని కుమార్ ఫెడరల్ తో అన్నారు.

కనీసం ఐదు స్థానాల్లో పోటీ ఉండనప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టని, ఇతర రాజకీయ పార్టీల ప్రభావం తక్కువగా ఉన్న 30 అసెంబ్లీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తవాంగ్ జిల్లా నుంచి ఖండూతో సహా ఐదుగురు బీజేపీ అభ్యర్థులు పోటీ లేకుండా గెలుపొందనున్నారు.

2011లో తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ మరణించినప్పటి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ముక్తో అసెంబ్లీ నియోజకవర్గంలో ఖండూకు వ్యతిరేకంగా ప్రతిపక్ష అభ్యర్థి ఎవరూ లేరు. కాంగ్రెస్ నాయకుడు అయిన దోర్జీ 1990, 1995, 1999, ఏప్రిల్ 2011లో చాపర్ ప్రమాదంలో మరణించే వరకు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2011లో పెమా ఖండూ తన తండ్రి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉప ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2014లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఖండుని విజయ పరంపర..

జూలై 2016లో సీఎం అయిన పెమా ఖండూ, సెప్టెంబర్‌లో 43 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీజేపీ మిత్రపక్షమైన పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌లోకి ఫిరాయించారు. డిసెంబర్‌లో ఆయన బీజేపీలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ముక్తోలో పోలైన మొత్తం ఓట్లలో 70.74 శాతం సాధించి కాంగ్రెస్ అభ్యర్థి తుప్టెన్ కున్‌ఫెన్‌పై విజయం సాధించారు.

నామినేషన్ల దాఖలుకు చివరి రోజు మార్చి 27తో ముగియడంతో ఖండూతో పాటు మరో నలుగురు అభ్యర్థులపై అభ్యర్థులెవరూ తమ పత్రాలను దాఖలు చేయకపోవడంతో విజయానికి బాటలు వేశారు. ఖండూ తన నియోజకవర్గం నుంచి మూడోసారి ఏకగ్రీవంగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

“ప్రస్తుతం మేం దానిని ప్రకటించే స్థితిలో లేము. అయితే మరో అభ్యర్థి ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 30 తర్వాత మాత్రమే మేం అతని (పేమా ఖండూ) ఎన్నికను ప్రకటించగలము, ”అని అరుణాచల్ ప్రదేశ్ డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ లైకెన్ కోయు చెప్పారు.

పాపం పారేలో ప్రతిపక్షాల అభ్యర్థులు గైర్హాజరు కావడం కూడా ఉంది. ఇది రాబోయే ఎన్నికల్లో అధికార బీజేపీ ఆధిపత్యానికి అనుకూలం. సగాలీ, పాపం పారే నుంచి బీజేపీ నేత రతు టెక్కీ తిరుగులేని విజయం సాధించేందుకు సిద్ధమయ్యారు. దిగువ సుబంసిరి జిల్లాలోని జిరో నుండి హేగే అప్పా కూడా బరిలో లేకపోవడంతో రాష్ట్రంలో కాషాయ పార్టీ బలమైన కోటను మరింత పటిష్టం చేసిందనే చెప్పుకోవాలి.

సగాలీ నుంచి 30 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేసిన నబమ్ తుకీ..ఆలో నుంచి నామినేషన్ దాఖలు చేస్తూ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొగ్గు చూపారు.

Read More
Next Story