త్వరలో అమెరికా- వెస్టీండీస్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ కు తాత్కాలిక భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్, రాజస్థాన్ కెప్టెన్ గా అదరగొడుతున్న సంజూ శాంసన్, స్పిన్నర్ చాహాల్ జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే యువ ఒపెనర్ శుభ్ మన్ గిల్, హర్డ్ హిట్టర్ రింకూ సింగ్ లు మాత్రం రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
వీరు జట్టుతో కలిసి ప్రయాణం చేస్తారు. ఎవరైన కీలక ఆటగాడికి గాయం అయితే వారి స్థానాన్ని భర్తీ చేస్తారు. అహ్మదాబాద్‌లో సెక్రటరీ జై షా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య జరిగిన సమావేశం తర్వాత బీసీసీఐ రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టును ప్రకటించింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఇటీవల ఫామ్‌లో లేనప్పటికీ, జట్టులో చోటు దక్కించుకున్నారు. ఐపీఎల్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ గాను పాండ్యా తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. ప్రస్తుతం హర్దిక్ టీంకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్ మెన్, కెప్టెన్ సంజూ శాంసన్, రెండో వికెట్ కీపర్ గా కొనసాగుతున్నాడు. రిషబ్ పంత్ కు స్టాండ్ గా సంజూ ఉండనున్నారు. కెఎల్ రాహూల్, ఇషాన్ కిషన్ లను వెనక్కి నెట్టి శాంస్ చోటు దక్కించుకోవడం గమనార్హం. ఐపీఎల్ లో ప్రదర్శన ఆధారంగా శివమ్ దూబే జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే కీలక ఆటగాడు కెఎల్ రాహూల్ కు మాత్రం జట్టులో చోటు దక్కించుకోలేక పోయాడు. టీ20ల్లో అవసరమైనంత వేగంతో బ్యాటింగ్ చేయలేకపోతున్నాడనే విమర్శల నేపథ్యంలో ఈ కన్నడ ఆటగాడికి జట్టులో చోటు దక్కలేదు. అలాగే బీసీసీఐని పట్టించుకోకుండా తిరుగుబాటు చేసి యువ బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్ కు కూడా జట్టు ఎంపిక లో పరిగణలోకి తీసుకోలేదని తెలిసింది.
2023 ఆగస్టులో చివరిసారిగా భారత్ తరఫున ఆడిన లెగ్ స్పిన్నర్ చాహల్, కుల్దీప్ యాదవ్‌తో పాటు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ ఇద్దరి తో జట్టులో ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు ఉన్నట్లు అవుతుంది. వీరితో పాటు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఐపిఎల్‌లో పరుగులు సాధిస్తున్న గిల్, కోల్‌కతా నైట్ రైడర్స్ బిగ్-హిట్టర్ రింకూ సింగ్‌తో కలిసి స్టాండ్‌బైస్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఫామ్ లో లేనప్పటకీ యువ ఒపెనర్ యశస్వి జైశ్వాల్ పై సెలెక్టర్లు నమ్మకముంచారు.
టీ20 ప్రపంచకప్ జూన్ 2న USA- కరేబియన్‌లలో ప్రారంభమవుతుంది. జూన్ 5న న్యూయార్క్‌లో ఐర్లాండ్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది.
స్క్వాడ్:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (WK), సంజు శాంసన్ (WK), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. సిరాజ్.
రిజర్వ్‌లు - శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్