భారత్ లో అత్యంత శక్తివంతమైన మహిళలుగా..
x
నిర్మలా సీతారామన్, భారత ఆర్థికమంత్రి

భారత్ లో అత్యంత శక్తివంతమైన మహిళలుగా..

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళలుగా ఫోర్బ్ విడుదల చేసిన జాబితాలో భారత్ నుంచి నలుగురు చోటు దక్కించుకున్నారు.


భారత ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ ఈ జాబితాలో 32 వ స్థానం లో ఉన్నారు. గత ఏడాది ఫోర్బ్ విడుదల చేసిన జాబితాలో నిర్మలా సీతారామన్ 36 వ స్థానంలో ఉండగా , ఈసారి నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 32 వ స్థానానికి ఎగబాకారు. అలాగే ఈ జాబితాలో భారత్ నుంచి హెచ్ సీఎల్ కార్పోరేషన్ సీఈఓ రోష్నీ నాడార్ మల్హోత్రా 60 స్థానంలో, స్టీల్ అథారిటీ అఫ్ ఇండియా( సెయిల్) చైర్ ఫర్సన్ సోమమొండల్ 70 వ స్థానం, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజూందార్ షా 76 వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయేన్ మొదటి స్థానంలో ఉన్నారు.

నిర్మలాసీతారామన్ 2019 నుంచి భారత ఆర్థికమంత్రిగా కొనసాగుతున్నారు. అలాగే కేంద్ర కార్పొరేట్ వ్యవహరాలను సైతం చూస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వంలో భారత రక్షణమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. జాబితాలో రెండో అత్యధిక ర్యాంక్ పొందిన రోష్ని నాడార్ వ్యాపారవేత్త శివ్ నాడార్ కుమార్తె. జూలై 2020 నుంచి హెచ్ సీ ఎల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు.

సెయిల్ కు సోమ మొండల్ 2021 నుంచి బాధ్యతలు స్వీకరించి ఉక్కు తయారీలో మంచి వృద్ధిని నమోదు చేయడంతో ప్రగతిని కనబరిచారు. సోమ మొండల్ సెయిల్ కు మొదటి మహిళా చైర్ పర్సన్ కావడం గమనార్హం. కిరణ్ మజుందార్ ను ఫోర్బ్ భారత దేశపు అత్యంత సంపన్నుల్లో ఒకరిగా ప్రకటించింది. 1978 లో బయోకాన్ అనే ఫార్మాస్యూటికల్ స్థాపించింది. అలాగే ఈ జాబితాలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ క్రిస్టిన్ లగార్డ్ రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యరిస్ ఉన్నారు.

Read More
Next Story