సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. ఏఎస్ఐ దుర్మరణం
x

సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. ఏఎస్ఐ దుర్మరణం

పరారీలో వాహనాన్ని నడుపుతున్న హోంగార్డు రామారావు.


సంగారెడ్డి జిల్లా మానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ గోవింద్ నాయక్ ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ స్టేషన్ ముందే ఈప్రమాదం జరిగింది. గోవింద్‌పైకి పోలీసు వాహనం దూసుకెళ్లగా ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రమాదానికి కారణమైన పోలీసు వాహనాన్ని నడిపిన హోంగార్డు రామారావు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఏఎస్ఐ కుటుంబ సభ్యులు మాత్రం రామారావు కక్షపూరితంగానే గోవింద్‌ను హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు రామారావు కోసం గాలింపు చర్యలు కూడా ప్రారంభించినట్లు చెప్పారు.

Read More
Next Story