కేజ్రీవాల్ ఇంట్లో ఆప్ ఎంపీపై దాడి.. ఎంత గొడవ అవుతున్నదో!
x
దాడికి సంబంధించి వివరాలను తెలుసుకోవడానికి మలివాల్ నివాసానికి చేరుకున్న పోలీసులు

కేజ్రీవాల్ ఇంట్లో ఆప్ ఎంపీపై దాడి.. ఎంత గొడవ అవుతున్నదో!

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంట్లనే పార్టీ మహిళా ఎంపీపై ఆయన వ్యక్తిగత సహాయకుడు ఎందుకు దాడి చేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది. బాధితురాలి వర్షన్ ఏంటి?


ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లిన ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌ను కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు చేయిచేసుకున్నాడు. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌ ఫిర్యాదు ఆధారంగా ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు ఢిల్లీ పోలీసులు గురువారం (మే 16) ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మరుసటి రోజు (శుక్రవారం) జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) ఆయనకు సమన్లు కూడా జారీ చేసింది.
అసలేం జరిగింది..
పోలీసుల కథనం మేరకు..ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయి ఈ నెల 13న మధ్యంతర బెయిల్ పై విడుదలయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‍ను కలిసేందుకు స్వాతి ఆయన ఇంటికి వెళ్లారు. డ్రాయింగ్ రూమ్‌లో వేచి వుండగా.. బిభవ్‌ కుమార్‌ ఆమె దగ్గరకు వచ్చి దాడి చేశారు. చెంపపై కొట్టాడు. కడుపుపైనే గాక సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడు. అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చిన స్వాతి వెంటనే పోలీసులకు ఫోన్‌ చేశారు. ఈ దాటి ఘటన కేజ్రీవాల్ ఇంట్లో ఉండగానే జరిగింది.
కేసు నమోదు..
తనపై దాడి చేసిన విషయాన్ని రెండు రోజుల తర్వాత స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు పోలీసు కమిషనర్ పిఎస్ కుష్వాహ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల బృందం మలివాల్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. తర్వాత బిభవ్‌ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 354, 506, 509, 323 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు.
వైద్య పరీక్షల కోసం తరలింపు..
బిభవ్‌ కుమార్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు స్వాతిని వైద్య పరీక్షల నిమిత్తం ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌)కు తరలించారు.
తన స్టెట్ మెంట్‌ను రికార్డు చేసేందుకు వచ్చిన పోలీసులు తన ఇంటి నుంచి వెళ్లిపోయాక స్వాతి ఎక్స్‌లో ఇలా పోస్టు చేశారు. ‘‘నాకు ఏం జరిగిందో ఢిల్లీ పోలీసులను చెప్పా. పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. బీజేపీ దీన్ని రాజకీయం చేయకూడదని కోరుకుంటున్నా." అని ఎంపీ పేర్కొన్నారు.

Read More
Next Story