పశ్చిమ బెంగాల్‌లో ఊరేగింపుపై దాడి - ఎవరి పని?
x

పశ్చిమ బెంగాల్‌లో ఊరేగింపుపై దాడి - ఎవరి పని?

దాడి చేసింది మీరంటే.. దాడి చేయించింది మీరేనంటూ..పశ్చిమ బెంగాల్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. అసలు అక్కడ ఏం జరిగింది?


పశ్చిమ బెంగాల్‌లో ఈ ఏడాది కూడా హింస చెలరేగింది. ముర్షిదాబాద్‌ జిల్లాలో శ్రీరామ నవమి సందర్భంగా ఊరేగింపు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శక్తిపూర్ హైస్కూల్ వద్ద ఊరేగింపుగా వెళ్తున్న వారిపై కొందరు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు గాయపడడంతో బిజెపి, అధికార టిఎంసి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ హింసాకాండకు బిజెపి నాయకుడు సువేందు అధికారి కారణమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్‌ఐఎ దర్యాప్తునకు కూడా ఆదేశించారు.

గవర్నర్‌కు వివరించా..

"పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. నవమి ఉత్సవాలకు ముందు రోజు మమత బెనర్జీ రెచ్చగొట్టేలా ప్రసంగించారని సువేందు ఆరోపించారు. "నేను గవర్నర్ డాక్టర్ సివి ఆనంద బోస్‌కు లేఖ రాశాను.ఊరేగింపులో దాడుల గురించి ఆయనకు వివరించాను.శాంతిభద్రతల నియంత్రణకు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరాను’’ అని సువేందు చెప్పారు. సువేందు కూడా ఎన్ఐఏతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

దాడి వెనక బీజేపీ కుట్ర..

మరోవైపు, రాష్ట్రంలో రామనవమి వేడుకల సందర్భంగా బీజేపీ హింసను ప్రేరేపించిందని మమత ఆరోపించారు. ఒక ప్లాన్ ప్రకారం లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ ఈ ఘటనకు పాల్పడిందని ఆరోపించారు.

ఒక ప్లాన్ ప్రకారమే..

‘‘అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. ముర్షిదాబాద్ డీఐజీని రామ నవమికి ఒక రోజు ముందు తొలగించారు. తద్వారా మీరు (బీజేపీ) హింసకు పాల్పడవచ్చు, ”అని రాయ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె అన్నారు.

ఎంపీ పరామర్శ..

క్షతగాత్రులను బెహ్రాంపూర్‌లోని ముర్షిదాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలిని పరిశీలించిన తర్వాత బెర్హంపూర్ ఎంపీ,కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి గాయపడ్డవారిని పరామర్శించారు.

గత ఏడాది కూడా బెంగాల్‌లో జరిగిన రామనవమి వేడుకలు హింసాత్మకంగా మారాయి. ఇది బిజెపి, తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారుల మధ్య ఘర్షణలకు దారితీసింది.

Read More
Next Story