ఏవియేషన్: అత్యధిక బాండ్లు కొన్నది ఈ రెండు సంస్థలే
x

ఏవియేషన్: అత్యధిక బాండ్లు కొన్నది ఈ రెండు సంస్థలే

కోవిడ్ మహ్మరి సమయంలో విమానరంగం నష్టాల్లో ఉన్నప్పటికీ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశాయి. వీటి విలువ దాదాపు రూ. 56 కోట్లని తేలింది.


దేశంలో ఎలక్టోరల్ బాండ్ల విషయంపై రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. దేశంలో ఏవియేషన్ రంగం బలహీనంగా ఉన్నదశలో కూడా ఇండిగో, స్పైస్ జెట్ లు దాదాపు 56 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశాయని తేలింది. తాజాగా అవి వూహాన్ వైరస్ విజృంభించిన కాలంలో కూడా ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయడానికి కూడా అవి వెనకాడలేదని తెలిసింది. ఇవన్నీ కూడా 2019 నుంచి 2023 మధ్య కాలంలో చోటు చేసుకున్నాయి.

ఇండిగో, దాని మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ సంబంధిత సంస్థల ద్వారా - ఇంటర్‌గ్లోబ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్, ఇంటర్‌గ్లోబ్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ వీటిని కొనుగోలు చేసింది. ఈ 36 కోట్ల బాండ్లను ఇండిగోకు ప్రమోటర్ అయిన రాహుల్ భాటియా బాండ్లను కొనుగోలు చేశారు.
2021 ఏప్రిల్‌లో మహమ్మారి విమానయాన రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసినప్పుడు కూడా దాదాపు రూ. 20 కోట్లు కొనడం కూడా కొసమెరుపు. జనవరి, జూలై 2021 మధ్య మొత్తం రూ. 65 లక్షలతో మూడు వేర్వేరు కొనుగోళ్లను చేసింది. ABC Ltd, IATA లైసెన్స్‌ని కలిగి ఉన్న కోల్‌కతాకు చెందిన లాజిస్టిక్స్ కంపెనీ, రూ. 40 లక్షల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది.
ఇండిగో గుత్తాధిపత్యం
ఇండిగో విమానయాన రంగంలో దాదాపు 65 శాతం మార్కెట్ వాటాతో గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది. పెద్ద నగరాలతో పాటు చిన్న నగరాలలో కూడా దీనిదే ఆధిపత్యం ఎక్కువ. అయినప్పటికీ ఈ సంస్థ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, డీజీసీఏ రాడార్ పరిధిలోకి మాత్రం రాలేదు.
ఇక స్పైస్‌జెట్ మనదేశంతో పాటు విదేశాలలో అనేక చట్టపరమైన కేసులను ఎదుర్కొంటోంది మారన్ వివిధ ఎయిర్ లైన్స్ సంస్థలకు కలిపి రూ. 579 కోట్లు చెల్లించాలని 2018లోనే మధ్యవర్తిత కోర్టు ఆదేశించింది. అయితే ఏదైన ఎక్కువ చెల్లింపులు చేస్తే ఎయిర్ లైన్ కంపెనీ దివాలా తీస్తుందని ఇటీవల కోర్టుకు వెల్లడించింది.
బయటకు వస్తున్న సమాచారం ప్రకారం ఎయిర్ లైన్స్ ఓ వైపు పునరుద్దరణ చేపడుతున్నామని ప్రకటిస్తూ వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. ఇదే సమయంలో స్పైస్ జెట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్, బీజీ బీ అనే సంస్థ తో కలిసి దివాలా తీసిన గో ఎయిర్ అనే సంస్థ కోసం బిడ్ వేశారు. బిజీ బీలో మెజారిటీ వాటాదారు. నిషాంత్ పిట్టి, ఈయన ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫారమ్ EaseMyTrip సహ వ్యవస్థాపకుడు. బిజీ బీ ఏవియేషన్ లిమిటెడ్‌లో పిట్టికి 51 శాతం వాటా ఉంది.
మార్చి 15 నాటికి మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని తొలగించాలని అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు కోరిన తర్వాత మాల్దీవులకు అన్ని విమాన బుకింగ్‌లను నిలిపివేయాలనే కంపెనీ నిర్ణయాన్ని దాని CEO పిట్టి సమర్థించిన తర్వాత EaseMyTrip ఇటీవల వార్తల్లో నిలిచింది.
సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లపై తీర్పునిస్తూ వాటిని రాజ్యాంగ విరుద్దమైనవిగా ప్రకటించింది. వీటిలో ప్రధాన లబ్దిదారుడిగా బీజేపీ ఉండగా, తరువాత స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.
Read More
Next Story