వైరల్ అయిన రామ్‌లల్లా ఫొటోలపై దర్యాప్తు చేయమంటున్నదెవరు? ఎందుకు?
x

వైరల్ అయిన రామ్‌లల్లా ఫొటోలపై దర్యాప్తు చేయమంటున్నదెవరు? ఎందుకు?

అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతున్న వేళ.. ఆలయ ప్రధాన పూజారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కోపానికి కారణం ఏమిటి?


మైసూరుకు చెందిన కళాకారుడు అరుణ్‌ యోగిరాజ్‌ చెక్కిన 51 అంగులాల ఎత్తు ఉన్న రామ్‌లల్లా విగ్రహాన్ని ఇటీవల ఆలయానికి తీసుకొచ్చారు. తర్వాత విగ్రహం కళ్లను పసుపు గుడ్డతో కప్పి ఉంచి, గులాబీ దండతో అలంకరించారు. ఈ ఫొటోలు గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. అయితే శుక్రవారం సోషల్‌ మీడియాలో కనిపించిన ఫొటోలపై ఆలయ ప్రధాని పూజారి సత్యేంద్ర దాస్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘ప్రాణ ప్రతిష్ఠ’ జరిగే వరకు విగ్రహం కళ్లను పసుపు వస్త్రంతో కప్పి ఉంచుతాం. ఆ తర్వాతే ఆ వస్త్రాన్ని తొలగిస్తాం. ఈ లోపు కళ్లకు ఆచ్చాదన లేసి ఫొటోలు సోషల్‌ మీడియాలో కనిపించాయి. అసలు విగ్రహం ఫొటోలు బయటకు ఎలా వెళ్లాయో విచారణ జరపాలి’’ అని డిమాండ్‌ చేశారు.

కాగా సోమవారం (జనవరి 22) మధ్యాహ్నం 12:20 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశామని ఉప ముఖ్యమంత్రి బ్రజేష్‌ పాఠక్‌ తెలిపారు.

Read More
Next Story