టీఆర్ఎఫ్ పై బ్యాన్.. తెరవెనక ఏం జరిగిందంటే: శశిథరూర్
x
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్

టీఆర్ఎఫ్ పై బ్యాన్.. తెరవెనక ఏం జరిగిందంటే: శశిథరూర్

ప్రయివేట్ సమావేశాల్లో అమెరికాను, పాక్ ఉగ్రవాద విషయంపై ఎందుకు ఉపేక్షిస్తున్నారని అడిగినట్లు తెలిపిన కాంగ్రెస్ నాయకుడు


పహల్గాంలో అమాయకమైన టూరిస్టులను మతం పేరిట కాల్చి చంపి తరువాత బాధ్యత తీసుకున్న టీఆర్ఎఫ్ పై అమెరికా నిషేధం విధించింది. దీనిని విదేశీ ఉగ్రవాద సంస్థగా ఆ దేశం ప్రకటించింది. అయితే ఈ నిషేధం హఠాత్తుగా రాలేదని, తెరవెనక జరిగిన ప్రయత్నాలను కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ తాజాగా వెలుగులోకి తెచ్చారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఆయన ట్వీట్ చేశారు. టీఆర్ఎఫ్ పై నిషేధం విధించినందుకు అమెరికాను ప్రశంసించారు. పాకిస్తాన్ కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ప్రతినిధి అయిన ఉగ్రవాది పహల్గాం ఉగ్రవాద దాడికి బాధ్యత వహించారు. ఈ దాడిలో 26 మంది పౌరులు మృతి చెందారు. ముంబై 26/11 ఉగ్రవాద దాడి తరువాత భారత పౌరులపై జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా గుర్తించారు.
అమెరికా వైఖరి..
ఈ సంవత్సరం ప్రారంభంలో వాషింగ్టన్ లో అమెరికా అధికారులతో తన ప్రైవేట్ సమావేశాల సందర్భంగా ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం కల్పించినప్పటికీ, పాకిస్తాన్ ను ఎందుకు శిక్షించడం లేదని తాను నేరుగా ప్రశ్నించానని థరూర్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. కాబుల్ విమానాశ్రయంలో 23 మంది అమెరికన్ మెరైన్ లకు చంపిన అబ్బే గేట్ బాంబు దాడికి కారణమైన వ్యక్తి ఇటీవల లొంగిపోవడాన్ని కూడా తాను ప్రస్తావించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ దాడి ఆగష్టు 2021 లో కాబూల్ లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని అబ్బే గేట్ వద్ద అమెరికా దళాల ఉపసంహరణ సమయంలో జరిగిన ఆత్మాహుతి దాడికి సంబంధించింది. తరువాత ఈ దాడికి ఐఎస్ఐఎస్ బాధ్యత వహించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో తాలిబన్లు నిందితుడిని అమెరికాకు అప్పగించారు.
అంతరాన్ని తగ్గించడం..
‘‘పాకిస్తాన్ ఉగ్రవాదంపై తీసుకునే చర్యల నాణ్యత, నిజాయితీ గురించే మా సందేహం. ఐఎస్ఐస్ వంటి అమెరికా శత్రు సంస్థల కంటే మా స్వంత అనుభవం ఇంకా ఎక్కువగా ఉంది. దీనిపై యూఎస్, మా మధ్య అవగాహన ఈ అంతరాన్ని తగ్గించడానికి ఈ నిషేధం ఒక అడుగు. యూఎన్ లో టీఆర్ఎఫ్ ను జాబితా చేసే ప్రయత్నాలకు ఇది సహాయపడుతుంది’’ అని థరూర్ అన్నారు.
అమెరికా, టీఆర్ఎఫ్ ను నియంత్రించడాన్ని భారత్ ఒక ప్రకటనలో స్వాగతించింది. దీనిని ఉగ్రవాద వ్యతిరేకతపై భారత్, అమెరికా మధ్య ఉన్న లోతైన సంబంధాలను, సహకారాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన చర్యగా అభివర్ణించింది.
విదేశాంగమంత్రి ఎస్. జై శంకర్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘‘భారత్- అమెరికా ఉగ్రవాద వ్యతిరేక సహకారానికి బలమైన ధృవీకరణ. టీఆర్ఎఫ్ అనేది లష్కరే తోయిబా ముసుగు సంస్థ.
ప్రత్యేకంగా గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించినందుకు సెక్రటరీ రూబియో, స్టేట్ డిపార్ట్ మెంట్లకు అభినందనలు, ఏప్రిల్ 22 నాటి పహల్గామ్ దాడికి ఇది బాధ్యత వహించింది. భారత్ ఉగ్రవాదాన్ని అసల సహించదు. ఆపరేషన్ సిందూర్’’ అని ఆయన ట్వీట్ చేశారు.
ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానానికి కట్టుబడి ఉందని సరిహద్దు అవతల నుంచి పనిచేస్తున్న గ్రూపులు, ప్రాక్సీలకు జవాబుదారీతనం కొనసాగించాలని విదేశాంగ శాఖ అభిప్రాయపడింది.
Read More
Next Story