బంగ్లాదేశ్ ఎంపీని గొర్రెను కోసినట్టు కోసి చర్మం వలిచి ప్యాక్ చేశారు?
ఓ మనిషిని ఇంత దారుణంగా చంపేసి ఉప్పు పాతరవేస్తారా? ఎంపీ హత్యకు చేసిన ప్లాన్ వింటుంటే కక్ష వెనుక ఇంత అమానుషం ఉంటుందా అని ఒళ్లు జలదరిస్తుంది.
బంగ్లాదేశ్ అధికార పార్టీకి చెందిన ఎంపి అన్వరుల్ అజీమ్ అనార్.. ఇండియాకి వచ్చారు. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. పోలీసులు ఆరా తీస్తే కోల్‌కతాలో భయంకరంగా మర్డర్ అయ్యారు. ఇప్పుడా మర్డర్ జరిగిన తీరు, దానిపై బయటికివస్తున్న విషయాలు వింటుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఓ మనిషిని ఇంత దారుణంగా చంపేసి ఉప్పు పాతరవేస్తారా? ఎంపీ హత్యకు చేసిన ప్లాన్ వింటుంటే కక్ష వెనుక ఇంత అమానుషం ఉంటుందా అని ఒళ్లు జలదరిస్తుంది.
పశ్చిమ బెంగాల్ సిఐడి పోలీసులు హత్యకు పాల్పడిన బంగ్లాదేశ్ పౌరుణ్ణి ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బాంగోన్ లో అరెస్టు చేశారు. బంగ్లా ఎంపీ అనార్ హత్యకు ముందు రెండున్నరలుగా ఈ కసాయి బాంగోన్ లోని న్యూ టౌన్ ఫ్లాట్‌లో ఉంటున్నాడు. "ఈ హత్య తర్వాత ఆ నిందితుడు ముంబైకి లేదా బంగ్లాదేశ్‌కు పారిపోవాలని ప్లాన్ చేశాడు. ఆయన సహచరులు సహకరించకపోవడంతో ఆ పని చేయలేకపోయాడు. కాని నిందితుని సహచరులు మాత్రం పారిపోయారు" అని పోలీసులు చెప్పారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బంగ్లాదేశ్ ఎంపీని మర్డర్ చేయడానికి ముందు కనీసం నాలుగు రోజులు ఆయన్ని ఈ ఇద్దరు నేరస్థులు కోల్‌కతాలోని న్యూ మార్కెట్ ప్రాంతంలోని ఒక హోటల్‌లో ఉంచారు.
అన్వరుల్ అజీమ్ అనార్ బంగ్లాదేశ్‌లోని జెనైదా-4 నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎంపీ మే 12న ఇండియాకి వచ్చారు. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. మే 18న, కోల్‌కతాలోని బిధాన్‌నగర్‌లో ఉంటున్న ఆ ఎంపీ కుటుంబ స్నేహితుడు గోపాల్ విశ్వాస్ మిస్సింగ్ కేసును దాఖలు చేశారు.
కుట్రకు ఢాకాలో తెరలేచింది...
పిటిఐ వార్త సంస్థ కథనం ప్రకారం, ఈ ఎంపీ హత్యకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోనే ప్లాన్ వేశారు. కోల్ కతాలో అమలు చేశారు.ఐదారు నెలల కిందటే మర్డర్ ప్లాన్ జరిగిందని పశ్చిమ బెంగాల్ సిఐడి అధికారులు చెప్పారు. గొంతు నులిమి చంపడం లేదా నరికివేయడమో చేయాలని ప్లాన్ చేశారు.
కోల్‌కతా పోలీసులు కథనం ప్రకారం ఎంపీని మొదట గొంతుకోసి చంపేశారు. తాట (చర్మం) వలిచేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా ముక్కలుగా నరికారు. వళ్లంతా కుళ్లబొడిచారు. శరీరాన్ని ఛిద్రం చేశారు. గుర్తించడానికి వీల్లేకుండా చేశారు. ఈ నేరాన్ని చేయడానికి ఆ కసాయిని కూడా బంగ్లాదేశ్ నుంచే రప్పించారు. ఈ కసాయి కూడా "చట్టవిరుద్ధంగా భారతదేశానికి వచ్చారని" అధికారి తెలిపారు.
"అసలీ దారుణాన్ని ఊహించలేకుండా ఉన్నాం. అనార్ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశారు. గుర్తించడానికి వీల్లేగుండా చర్మాన్ని వలిచేశారు. కండల్ని, ఎముకల్ని వేరు చేశారు. మనం ఇళ్లల్లో కూర వండుకోవడానికి చికెన్ తెచ్చుకుంటే నెత్తురు మరకలు పోవడానికి ఎలా పసుపు, ఉప్పు వేసి కడుగుతామో అలా ఆయన శవాన్ని నరికి పోగులు పెట్టి పసుపు వేసి కడిగి ప్లాస్టిక్ బ్యాగ్స్ లో ప్యాక్ చేశారు" అని సీఐడీ అధికారి చెప్పారు. బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ కు ఓ మగువను ఎరవేసినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రేమ పేరిట ఆయన్ను కోల్ కతా పిలిపించినట్టు తెలుస్తోంది.
హత్యకు రూ.5 కోట్లు చెల్లించారు...
అమెరికాలో ఉంటున్న ఈ ఎంపీ మిత్రుడే ఈ మర్డర్ సూత్రధారిగా భావిస్తున్నారు. అమెరికా పౌరసత్వం ఉన్న ఆ మిత్రుడే ఈ మర్డర్ కి ముందు ఒకటి రెండుసార్లు ఢాకాకు వచ్చి ఈ ప్లాన్ చేశారని అనుమానిస్తున్నారు. అనార్‌ను చంపడానికి కిరాయి మనుషుల్ని మాట్లాడింది కూడా ఆ స్నేహితుడేనని భావిస్తున్నారు. బంగ్లాదేశ్‌లోని వ్యక్తులతో సన్నిహితంగా ఉండటానికి ఫేస్‌టైమ్, టెలిగ్రామ్ మెసెంజర్ వంటి వర్చువల్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించారు.
ఈ హత్యకు అమెరికా పౌరుడైన ఎంపీ సన్నిహితుడు రూ. 5 కోట్లు చెల్లించినట్లు విచారణలో తేలింది. శరీరాన్ని ముక్కలు చేయడానికి మాంసాన్ని నరికే కత్తుల్ని, రంపాల్ని వాడారు. పుర్రె, ఎముకలను చాపర్‌తో కత్తిరించినట్లు అధికారులు తెలిపారు.
హత్య ఎలా చేశారంటే...
బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఎంపీ ఉంటున్న హోటల్లోకి ఓ అమ్మాయి సహా ముగ్గురు వెళ్లారు. ఆ తర్వాత ఆ ముగ్గురూ మూడు రోజుల పాటు బయటకు రాలేదు. ఎంపీని హత్య చేసిన తర్వాతే వాళ్లు బయటకు వచ్చినట్టు వీడియో ఫుటేజీ తెలుపుతోంది. ఎంపీని బలవంతంగా బాత్‌రూంలోకి తీసుకువెళ్లారు. అక్కడ నరికి చంపారు. “బాత్రూమ్ లో రక్తపు మరకలు లేకుండా చాలా సార్లు కడిగారు. నీళ్లను విపరీతంగా వాడారు. సోప్ వాటరు, డిటర్జెంట్ ఉపయోగించారు. రక్తపు మరకలు లేకుండా ఫ్లాట్ మొత్తాన్ని కూడా కడిగారు. అనాల్ గొంతు కోసిన తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికారు. పసుపేసి కడిగి ప్లాస్టిక్ బ్యాగ్స్ లో ప్యాక్ చేశారు. ఆ తర్వాత మద్యం తాగి అన్నం తిన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నిందితుల్లో ఇప్పటికి ముగ్గురు దొరికారు. అసలు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
హత్యకు గురైన బంగ్లాదేశ్ పార్లమెంటు సభ్యుడు అనార్ శరీర భాగాలను ఎక్కడెక్కడ విసిరేశారో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.