టెస్ట్ క్రికెటర్లకు భారీగా ఇన్సెంటివ్ ప్రకటించిన బీసీసీఐ
x

టెస్ట్ క్రికెటర్లకు భారీగా ఇన్సెంటివ్ ప్రకటించిన బీసీసీఐ

సాంప్రదాయక గేమ్ టెస్ట్ క్రికెట్ ను బతికించేందుకు బీసీసీఐ నడుంబిగించింది. టెస్ట్ మ్యాచ్ ఆడే వారికి ఒక నుంచి మ్యాచ్ ఫీజును డబుల్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు..


టెస్ట్ మ్యాచ్ లను బతికించేందుకు బీసీసీఐ నడుం బిగించింది. ముఖ్యంగా యువ క్రికెటర్లు వైట్ బాల్ గేమ్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే నేపథ్యంలో, సాంప్రదాయక ఆట అయిన టెస్ట్ క్రికెట్ ఆడేవారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని క్రికెట్ బోర్డు భావించింది. అందుకోసం ఇక నుంచి టెస్ట్ క్రికెట్ ఆడేవారికి మ్యాచ్ ఫీజు పెంచుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

ఈ మొత్తం దాదాపు రూ. 40 కోట్లని ప్రకటించింది. ధర్మశాల టెస్ట్ విజయంతో భారత్ సిరీస్ ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆ వెంటనే క్రికెట్ ఈ బోర్డు తన నిర్ణయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ మేరకు సెక్రటరీ జై షా ట్వీట్ చేశాడు. పెంచిన రూ. 40 కోట్లను 'టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్' గా ఆయన అభివర్ణించాడు.

ఈ నిర్ణయంతో సాంప్రదాయక టెస్ట్ క్రికెట్ ఆడే పుజారా, రహనే లాంటి వారికి మద్దతు ఇచ్చినట్లు అవుతుందని, అలాగే యువ క్రికెటర్ల ఐపీఎల్ లాంటి లీగ్ లతో పాటు ఇక నుంచి టెస్ట్ క్రికెట్ పైన దృష్టి పెడతారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

"మా గౌరవనీయమైన ఆటగాళ్లకు ఆర్థిక వృద్ధి, స్థిరత్వాన్ని అందించే లక్ష్యంతో సీనియర్ పురుషుల కోసం 'టెస్ట్ క్రికెట్ ప్రోత్సాహక పథకం' ప్రారంభించడంపై నేను సంతోషిస్తున్నాను. 2022-23 సీజన్ నుంచి 'టెస్ట్ క్రికెట్ ప్రోత్సాహక పథకం' ప్రారంభమవుతుంది. టెస్ట్ మ్యాచ్‌ల కోసం ప్రస్తుతం ఉన్న మ్యాచ్ ఫీజుపై అదనపు రివార్డ్ స్ట్రక్చర్‌గా దీనిని అందిస్తాం., INR 15 లక్షలుగా నిర్ణయించబడింది" అని షా తన ట్వీట్ లో వివరించారు.
కొత్త 'టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్' ప్రకారం, ఒక సీజన్‌లో ఏడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడిన వారికి (ఒక సీజన్‌లో 9 టెస్టులు) మ్యాచ్ ఫీజు రూ. 45 లక్షలు. ఆడని సభ్యుడు ఒక్కో మ్యాచ్‌కు రూ.22.5 లక్షలు అందుకుంటారు. ఒక సీజన్‌లో ఐదు లేదా ఆరు టెస్టులు ఆడే వారికి ఒక్కో మ్యాచ్‌కు రూ.30 లక్షలు, ఆడని సభ్యుడు రూ.15 లక్షలు అందుకుంటారు. ఒక సీజన్‌లో నాలుగు టెస్టుల కంటే తక్కువ ఆడే వారికి ఈ కొత్త ఫీజు విధానం వర్తించదని బీసీసీఐ తెలిపింది.





Read More
Next Story