
రిజిస్ట్రేషన్ల విషయంలో యజమానులుకు శుభవార్త
కొత్త విధానం ఏమిటంటే వాహనాలు కొన్న యజమానులు ఆ ఫోరూముల్లోనే తమ వెహికల్స్ ను రిజిస్ట్రేషన్లు చేసేసుకోవచ్చు
కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సిన వాహన యజమానులకు గుడ్ న్యూస్. కొత్త విదానంలో యజమానులకు బిగ్ రిలీఫ్ అనేచెప్పాలి. ఇంతకీ కొత్త విధానం ఏమిటంటే వాహనాలు కొన్న యజమానులు ఆ ఫోరూముల్లోనే తమ వెహికల్స్ ను రిజిస్ట్రేషన్లు చేసేసుకోవచ్చు. శనివారం నుండి ఈ విధానం అన్నీ షోరూంలలో అమల్లోకి వచ్చింది. మొన్నటివరకు ఉన్న విధానం ఏమిటంటే ఎవరైనా వాహనం కొన్నపుడు షోరూము ఓనర్ తాత్కాలికంగా రిజిస్ట్రేషనన్ నెంబరిస్తాడు. నెలరోజుల వర్తించే ఈ తాత్కాలిక వెసులుబాటులోపే పర్మినెంట్ గా యజమాని తన వాహనానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
షోరూము నుండి వాహనాన్ని తెచ్చుకోగానే యజమాని వెంటనే సంబంధిత పత్రాలను తీసుకుని అంటే వాహనం కొనుగోలు పత్రం, టెంపరరీ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి చూపించి శాస్వత రిజిస్ట్రేషన్ కు దరఖాస్తు చేసుకోవాలి. కొన్ని ఫోరూముల్లో డీలర్లే ఒక ఏజెంటును పెట్టుకుని యజమానుల తరపున రవాణాశాఖ కార్యాలయంలో ఈపనులన్నీ చేసిపెడుతున్నారు. ఇవన్నీ చేసినందుకు డీలర్లు షోరూముల్లో వాహనాలు అమ్మేటప్పుడే యజమానుల నుండి డబ్బులు తీసుకుంటున్నారు.
దరఖాస్తు అయిన తర్వాత రవాణాశాఖ నుండి వచ్చిన సమాచారం ఆధారంగా యజమాని తన వాహనాన్ని తీసుకుని ఆఫీసుకు వెళ్ళి అక్కడ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసుకోవాలి. తర్వాత ఎప్పుడో యజమానికి రవాణాశాఖ ఆఫీసు నుండి పర్మినెంట్ రిజిస్ట్రేషన్(నెంబర్) పోస్టులో అందుతుంది. ఇదంతా అయ్యేటప్పటికి చాలాకాలం పట్టడమే కాకుండా డబ్బులు కూడా చాలానే వదులుతుంది.
అందుకనే ఇలాంటి సమస్యలు లేకుండా చేయటం కోసమే రాష్ట్రప్రభుత్వం ఈరోజు నుండి కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అమల్లోకి వచ్చింది ఈరోజు నుండే అయినా చాలాకాలంగా పరిశీలనలోనే ఉంది. ఈ కొత్త విధానం ఏమిటంటే వాహనాన్ని అమ్మిన డీలరే సదరు వాహనాన్ని షోరూములోనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం వాహన యజమాని తరపున ఆన్ లైన్ లో దరఖాస్తు చేస్తాడు. వచ్చిన దరఖాస్తును రవాణాశాఖ అధికారులు ఆన్ లైన్లో పరిశీలించి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ను ఇచ్చేస్తారు. ఉదయం ఆన్ లైన్లో షోరూములో నుండి దరఖాస్తును అప్ లోడ్ చేస్తే సాయంత్రానికి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ యజమానికి వచ్చేస్తుంది. ఒకవేళ సాయంత్రం వాహనాన్ని కొనుగోలు చేస్తే మాత్రం మరుసటి రోజే దరఖాస్తు చేయాల్సుంటుంది.
ఈ కొత్త విధానం వల్ల వాహన యాజమానికి కొంత డబ్బులు ఖర్చయినా రవాణాశాఖ కార్యాలయం చుట్టూ తిరగటం ఉండదు, డబ్బులు ఖర్చుచేసుకునే అవసరం ఉండదు. ఒకవేళ షోరూములో ఏదైనా సమస్యలు ఎదురైతే వాహన యజమాని నేరుగా రవాణాశాఖ ఆఫీసులో ఫిర్యాదు చేయచ్చు.

