లండన్ లో సమోసా సన్సేషన్...
x
Photos from Instagram

లండన్ లో సమోసా సన్సేషన్...

సమోసాలో ఇంగ్లండు రాజధాని మనుసుదోచుకున్న బీహారీ కుర్రవాడు


లండన్ రద్దీ వీధుల్లో తనదైన అద్భుత శైలిలో సమోసాలు అమ్ముతు సంచలనం సృష్టించిన బీహరీ యువకుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.

సరదాగా ఆడుతూ పాడుతూ సమోసాలు అమ్ముతున్న అతగాడి వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది, ఇంటర్నెట్ ప్రపంచమంతా ఔరా అనేలా చేసింది. కొందరు నెటిజన్లు "ఇది బిహార్ తడాఖా!" (బిహార్ శక్తి) అని కూడా వ్యాఖ్యానించారు.

ఈ వీడియోని @biharisamosa.uk అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా లో పోస్ట్ చేశారు. క్లిప్ లో, రుచికరమైన సమోసాలు తయారు చేస్తున్న కుర్రవాడు తమాషాగా "జబ్ తక్ లండన్ మా రహేగా బిహారీ, తబ్ తక్ సమోసే కా స్వాద్ హమేషా రహేగా జారీ." (Jab tak London ma rahega Bihari, tab tak samose ka swaad hamesha rahega jaari) అనికూని రాగం తీస్తుంటాడు. అతని సమోసా స్టాల్ పేరు ఘంటావాలా సమోసా.

అతగాడు ఎంత చక్కగా సమోసాలు తయారు చేస్తాడో, లండన్లోని భారతీయులు, స్థానికులు వాటిని ఎంతగా ఆస్వాదిస్తారో ఈ వీడియోలో చెబుతుంది. వీడియోకి "లండన్ కి అత్యుత్తమ సమోసా" (Best Samosa in London) అని క్యాప్షన్ ఇచ్చారు, దుకాణం ఎక్కడ ఉందో కూడా పేర్కొన్నారు.

* 149 Ealing Rd, Opposite Sanatan Temple

Wembley, HA04BY

.

* Unit 12, South Harrow Market, Northolt Rd, South Harrow, Harrow


ఈ వీడియో ఎంత వైరల్ అయ్యిందంటే 20 లక్షలకు పైగా లైక్స్, 5,000 కామెంట్లు, 37 మిలియన్లకు పైగా వ్యూలు వచ్చాయి. ఈ ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా ఇటీవలే. అనేక వీడియోల్లో ఈ బిహారీ కుర్రాడి అమ్ముతున్న రుచికరమైన సమోసాలుమీద కస్టమర్ రివ్యూలు కూడా ఉన్నాయి.



ప్రతిస్పందనలు చాలా ఉత్తేకరంగా ఉన్నాయి. ఒక యూజర్ "పవర్ ఆఫ్ బిహార్" అని రాశాడు. అతని స్టాల్ శుచి శుభ్రత, కస్టమర్లకు సేవలందిస్తున్న ఆరోగ్యరమయిన పద్ధతి చూసి చాలా మంది నెటిజన్లు అక్కడికి వస్తున్నారు. మరొక యూజర్ ఇలా కామెంట్ చేశాడు: "భాయ్, మీరు మేము గర్వపడేలా చేశారు! లండన్లో నిలబడి బిహార్ పేరు, బీహారీ సమోసా దాని అసలైన రుచిని పరిచయం చేశారు. నిజంగా ఉత్తేజకరం. మీలాంటి వాళ్ళు వల్లే, బిహార్ ప్రపంచవ్యాప్తంగా ప్రకాశిస్తూ ఉంటుంది."


Read More
Next Story