నాగ్‌పూర్ డాలీని ‘‘వన్ చాయ్ ప్లీజ్’’ అని అడిగిన బిల్‌గేట్స్..
x

నాగ్‌పూర్ డాలీని ‘‘వన్ చాయ్ ప్లీజ్’’ అని అడిగిన బిల్‌గేట్స్..

డాలీ తయారుచేసిన టీని బిల్ గేట్స్ అందుకుని సిప్ చేశారు. ‘‘వన్ చాయ్ ప్లీజ్’’ అంటూ కితాబిచ్చారు.


నాగ్‌పూర్‌కు చెందిన డాలీ గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇతను ఓ చాయ్‌వాలా. నాలుగు చక్రాలున్న తోపుడు బండిపై టీ తయారుచేసి విక్రయిస్తుంటాడు. ఇందులో ప్రత్యేకతేముంది అనుకోకండి. ఇతను టీని విభిన్నంగా తయారుచేస్తాడు. ఓ స్టైల్‌లో తయారు చేయడం.. బొలెడంతా పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. పొడవాటి జట్టు, పెద్ద సైజు కళ్లద్దాలు, ఒంటిపై కోటు, చెవిలో బ్లూ టూట్ డివైజ్..మరో స్పెషల్ అట్రాక్షన్. ఈ వేషధారణలో చూసిన ఎవరైనా డాలీ టీ తయారుచేయడం ఏంటని ఆశ్చర్య పోతారు. కాని అదే నిజం.

తన స్టైల్లో టీ తయారు చేసే డాలీని ఇటీవల నాగ్ పూర్ నుంచి హైదరాబాద్ కు రప్పించారు. కానీ తాను మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ కోసం టీ తయారుచేస్తున్నాడన్న విషయం అతనికి చెప్పలేదు. డాలీని తయారుచేసిన టీని బిల్ గేట్స్ అందుకుని సిప్ చేశారు. ‘‘వన్ చాయ్ ప్లీజ్’’ అంటూ కితాబిచ్చారు.

వైరలయిన వీడియో..

డాలీ తయారుచేసిన టీని బిల్‌గేట్స్ తాగుతుండగా తీసిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియాలో తెగ వైరలైంది. అప్పడు తెలిసింది డాలీకి తాను తయారు చేసిన టీని తాగింది సామాన్యమైన వ్యక్తి కాదని. ప్రపంచంలో ఎంతో పేరున్న ప్రముఖ వ్యక్తి బిల్ గేట్స్ అని.


“అతను ఎవరో నాకు తెలియదు. ఎవరో విదేశీయుడు అనుకున్నా. అతను (బిల్ గేట్స్) నా పక్కనే నిలబడి ఉన్నాడు. నేను నా పనిలో బిజీగా ఉన్నాను. నా స్టైల్‌లో టీ తయారుచేసి టీ అందించాను అంతే. నా టీ సిప్ చేసి.. వావ్! డాలీ కి చాయ్' అని అన్నారు. నేను ఎవరికి టీ అందించాన్న విషయం మరుసటి రోజు నాగ్‌పూర్‌కు తిరిగి వచ్చాక తెలిసింది. ’’ సంతోషంగా చెప్పాడు డాలీ.

తన ప్రత్యేకమైన దుస్తులను సౌత్ ఇండియా సినిమాల నుంచి కాపీ కొట్టానని చెబుతున్న డాలీ.. ‘‘ఈరోజు నేను ‘నాగ్‌పూర్‌ కా డాలీ చాయ్‌వాలా’గా మారాను. భవిష్యత్తులో ప్రధాని నరేంద్ర మోదీకి టీ అందించాలనుకుంటున్నాను' అని అన్నారు.

"నా జీవితమంతా చిరునవ్వుతో అందరికీ టీ అమ్మాలని, ఆ చిరునవ్వులన్నింటినీ తిరిగి పొందాలని నేను కోరుకుంటున్నాను" అని నవ్వుతూ చెప్పాడు డాలీ.

అసలు బిల్ గేట్స్ ఇండియాకు ఎందుకొచ్చారు..

అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనేందుకు బిల్ గేట్స్ ఇండియా వచ్చారు. "భారతదేశంలో, మీరు తిరిగే ప్రతిచోటా ఆవిష్కరణలను కనుగొనవచ్చు - టీ తయారు చేయడం కూడా!" అని ఇన్‌స్టా పోస్టు చేశారు.

Read More
Next Story