బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయాయి
x

బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయాయి

బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు ఏకమవ్వటంతో ఎన్నిక సజావుగా సాగిపోయింది


నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్, బీజేపీ ఏకమైపోయి కాంగ్రెస్ ను ఓడించాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఆదివారం జరిగిన ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలో బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏకమైపోయాయి. బీజేపీ కౌన్సిలర్ మౌనికకు మద్దతుగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఓట్లేశాయటంతో మౌనిక ఏకగ్రీవంగా ఖానాపూర్ మున్సిపాలిటీకి ఛైర్ పర్సన్ అయిపోయారు. ఆమధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఖానాపూర్ మున్సిపాలిటీకి కూడా ఎన్నిక జరిగింది. మున్సిపాలిటీలో 12 వార్డులున్నాయి. వీటిల్లో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3 వార్డుల్లో గెలవగా మరో వార్డులో ఇండిపెండెంట్ గెలిచాడు. 12 వార్డుల మున్సిపాలిటీలో ఛైర్మన్ కావాలంటే 7 గురు కౌన్సిలర్ల మద్దతుండాలి.

అందుకనే ఛైర్మన్ పదవి కోసం మూడు పార్టీలు దేని ప్రయత్నం అదిచేయటంతో ఎన్నిక గందరగోళంగా తయారైంది. అందుకనే పలుసార్లు ఛైర్మన్ ఎన్నికను అధికారులు వాయిదావేశారు. చివరకు ఈరోజు ఎన్నిక జరిగింది. మున్సిపాలిటీని ఎలాగైనా గెలుచుకోవాలని బీఆర్ఎస్, బీజేపీలు ఒప్పందం చేసుకున్నాయి. ఈరోజు ఎన్నికలో బీజేపీ ఛైర్ పర్సన్ అభ్యర్ధి మౌనికకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మద్దతు ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్ కౌన్సిలర్ మహమ్మద్ షోయబ్ వైస్ ఛైర్మన్ అవటానికి బీజేపీ కౌన్సిలర్లు మద్దతిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు ఏకమవ్వటంతో ఎన్నిక సజావుగా సాగిపోయింది. అడ్డుకోవటానికి కాంగ్రెస్ కు ఎలాంటి కారణం దొరకలేదు.

Read More
Next Story