ప్రజ్వల్ కేసులో బీజేపీ నేత అరెస్ట్
x

ప్రజ్వల్ కేసులో బీజేపీ నేత అరెస్ట్

కర్ణాటకలో హసన్ జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండిల్ వ్యవహారంలో కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.


కర్ణాటకలో హసన్ జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండిల్ వ్యవహారంలో కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విచారణను సిట్‌కు అప్పగించింది.
ప్రజ్వల్ బాధితుల కోసం హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. ఇటు పోలీసులు ఈ కేసు విచారణను వేగవంతం చేశారు. ఆ క్రమంలోనే బీజేపీ నేత, న్యాయవాది జి దేవరాజేగౌడను శుక్రవారం అర్థరాత్రి అరెస్టు చేశారు. పెన్ డ్రైవ్‌లోని ప్రజ్వల్ అశ్లీల వీడియోలను లీక్ చేశాడని ఆయనను చిత్రదుర్గ జిల్లాలోని హిరియూర్ పోలీసులు గులిహాల్ టోల్ గేట్ వద్ద అరెస్టు చేశారు.
కాగా కర్ణాటక లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 26వ తేదీకి ముందు ప్రజ్వల్‌కు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఆయన దేశం వీడారు. నోటీసులకు స్పందించకపోవడంతో పోలీసులు ఇంటర్‌పోల్ 'బ్లూ కార్నర్' నోటీసు జారీ చేశారు. అత్యాచారం, వేధింపులు, బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపులకు సంబంధించి ప్రజ్వల్‌పై ఇప్పటికే మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
దేవరాజేగౌడ తన అరెస్టును ఖండించారు. వీడియోలను లీక్ చేయలేదని వాదించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హోలెనరసిపుర నుంచి జేడీ(ఎస్) ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణపై దేవరాజే గౌడ పోటీ చేశారు.
ముగ్గురు పిల్లల తల్లిని కిడ్నాప్ చేసిన కేసులో ప్రజ్వల్ తండ్రి రేవణ్ణ ప్రస్తుతం జైలులో ఉన్నారు.
Read More
Next Story