మాకు 400 స్థానాలు గ్యారెంటీ: బీజేపీ చీఫ్ ప్రకటన
x

మాకు 400 స్థానాలు గ్యారెంటీ: బీజేపీ చీఫ్ ప్రకటన

సార్వత్రిక ఎన్నికల్లో మాకు 400 స్థానాలు వస్తాయని బీజేపీ చీఫ్ జేడీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి సొంతంగానే 370కి పైగా స్థానాలు వస్తాయని జోస్యం చెప్పిన..


దేశ అభివృద్ధి, సమర్థవంతమైన పాలన, స్వావలంబన కలిగిన భారత్ కోసం ప్రజలు ఓటు వేశారని, బుజ్జగింపు, బంధు ప్రీతి, అవినీతిని పక్కన పెట్టారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. అలాగే ఎన్డీఏ కూటమి 400 సీట్ల మార్కును దాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల ఏడో, చివరి దశ పోలింగ్ జరిగిన రోజున ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జూన్ 4న దేశంలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.

ఈ "ప్రజాస్వామ్య పండుగ"ను బిజెపికి విజయవంతం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. "అతని ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలితాలు ఇస్తున్నాయి" అని బిజెపి చీఫ్ నడ్డా ఒక ప్రకటనలో అన్నారు. అలాగే కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్,నితిన్ గడ్కరీలతో సహా బిజెపి నాయకులకు, ఎన్నికల సమయంలో వారికి సహకారం అందించిన"కోట్ల మంది పార్టీ కార్యకర్తలకు" నడ్డా కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొన్నందుకు ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షాలకు సైతం కృతజ్ఞతలు తెలిపిన ఆయన, వారి కృషితో తమ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించామని అన్నారు.
ఈ ఎన్నికల్లో దేశంలోని ఓటర్లు సమర్ధవంతమైన, శక్తివంతమైన, అభివృద్ధి చెందిన, స్వావలంబనతో కూడిన భారతదేశం, గొప్ప ఆర్థిక వ్యవస్థతో ముందుకు సాగాలని,ఆశీర్వదించారని బుజ్జగింపులు, బంధుప్రీతి అవినీతిని పక్కనపెట్టి ఓటు వేశారని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతీయ ఓటర్లు బీజేపీని 370కి పైగా సీట్లు, ఎన్డీయే 400కు పైగా సీట్లు గెలుచుకుంటారని నాకు పూర్తి విశ్వాసం ఉందని ఆయన అన్నారు. ఎన్నికల్లో పాల్గొన్నందుకు ప్రజలకు నడ్డా కృతజ్ఞతలు తెలిపారు
Read More
Next Story