సైనికుల పట్ల బీజేపీది నకిలీ జాతీయవాదం
x

సైనికుల పట్ల బీజేపీది నకిలీ జాతీయవాదం

ప్రస్తుతం బీజేపీ ఉపయోగిస్తున్న జాతీయవాదం అనే మూలాల్లోని డొల్లతనాన్ని, అలాగే సైనికులకు ఆర్థికంగా నష్టం చేస్తున్న విధానాలను ఎండగట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.


ఇందుకోసం ఓ ప్రణాళికను రూపొందించాలని అలాగే 2024 లోక్ సభ ఎన్నికల కాంగ్రెస్ మ్యానిఫెస్టో లో సైతం చోటు కల్పించాలని కూడా తీర్మానించుకుంది.

ప్రధాని గా నరేంద్ర మోదీ బాధ్యతలు తీసుకున్నాక కొత్త వికలాంగుల పెన్షన్ నిబంధనలు, సైనికుల నియమకాలకు సంబంధించి తీసుకొచ్చిన అగ్నిపథ్, వన్ ర్యాంక్, వన్ పెన్షన్ వల్ల సైనికులకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడాలని కాంగ్రెస్ మాజీ సైనికులు విభాగం చైర్మన్ కల్నల్ (రిటైర్డ్) రోహిత్ చౌధరి ఫెడరల్ తో అన్నారు.

జై జవాన్ ప్రచారం దేశ వ్యాప్తంగా..

రాహూల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా బిహార్ లో ప్రారంభించిన జై జవాన్ క్యాంపెన్ దేశ వ్యాప్తంగా చేయాలని పార్టీ భావిస్తున్నట్లు రోహిత్ చౌధరి అంటున్నారు. 2019-2022 మధ్య భారత సైన్యంలోని మూడు విభాగాల్లోకి దాదాపు 1.5 లక్షల అభ్యర్థులు వివిధ రకాల పరీక్షలను హాజరై ఉత్తీర్ణత సాధించారు. అయితే తరువాత తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంలో వల్ల వీరందరిని ఉద్యోగాల్లోకి తీసుకొవడానికి ప్రభుత్వం నిరాకరించింది. ఇదే అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రచార అంశంగా తీసుకోవాలని కాంగ్రెస్ పార్ఠీ భావిస్తోంది. సైనికులను పాత విధానంలోకి రిక్రూర్ మెంట్ చేసుకోవడంతో పాటు ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి నిరాకరించిన 1.5 లక్షల అభ్యర్థులకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని పార్టీ లక్ష్యంగా ఉంది.

మూడు దశల్లో

మొత్తం మూడు దశల్లో ఈ ఉద్యమం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతోంది. జై జవాన్, అన్యాయ్ కా విరుద్ద్ న్యాయ్ యుద్ద్ పేరిట ఫిబ్రవరి 28 లోగా 30 లక్షల సైనిక కుటుంబాలను ప్రత్యక్షంగా కలవాలని అనుకుంటోంది. ఇందులో రిటైర్ అయిన వాళ్లు, సర్వీస్ లో ఉన్న వారి కుటుంబాలు కూడా ఉంటాయి. అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు సైనిక కుటుంబాలు, సైన్యంలో చేరాలనుకున్న యువతను కలిసి వారికి పార్టీ తరఫున రూపొందించిన న్యాయ్ పత్రాలు అందించి ఉద్యమంలో భాగం కావాలని అభ్యర్థిస్తారు.

రెండో దశలో మార్చి 5 నుంచి 10 వరకూ సత్యాగ్రహ కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిలో ఎక్కువ మంది యువత పాల్గొనేలా కార్యక్రమాలు రూపొందిస్తారు. ఇందులో భాగంగా ధర్నాలు , రాస్తారోకోలు చేస్తారు. మూడో దశలో మార్చి 17 నుంచి 20 వరకూ అన్ని జిల్లాల్లో 50 కిమీ పాదయాత్ర చేస్తారు. ఇవన్నీ కూడా మోదీ నకిలీ జాతీయవాదాన్ని బట్టబయలు చేస్తుందని చౌదరి అంటున్నారు.

అగ్నివీర్ పై వివక్ష

సాధారణంగా సైన్యంలోకి నేరుగా వచ్చిన వారికి, అగ్నివీర్ కింద ఉన్నవారికి వేతనాల పరంగా తీవ్ర వ్యత్యాసాలు ఉంటున్నాయి. సాధారణ సైనికుడికి నెలకు రూ. 45 వేలు ఉండగా, అగ్నివీర్ కేవలం రూ. 21 వేలు మాత్రమే ఇస్తున్నారు. ఎవరైన అగ్నివీరుడు చనిపోతే అతడికి అమరుడి హోదా లభించదు. వారి కుటుంబాలకు అమరవీరుడికి అందించే మద్దతును కొల్పోతాయి. " మేము దీనిని షహదత్ మే భేద్ భావ్( మేము దీనిని బలిదానంలో కూడా వివక్ష)" అని పిలుస్తాము అని చౌధరి చెప్పారు.

అలాగే అగ్ని వీరులకు వైద్య, గ్రాట్యూటీ, పెన్షన్, క్యాంటిన్ సౌకర్యాలు, మాజీ సైనికుల హోదా, పిల్లలకు స్కాలర్ షిప్, సాధారణ సైనిక సిబ్బందికి అందుబాటులో ఉండే ఇతర ఏ సౌకర్యాలకు కూడా అర్హత ఉండదని ఆయన అన్నారు. తమకు అన్యాయం చేసిన ప్రభుత్వం పై పోరాటం చేసేందుకు 1.5 లక్షల మంది అభ్యర్థులకు కాంగ్రెస్ న్యాయ సాయం అందజేస్తుందని వెల్లడించారు. " బీజేపీ సాయుధ దళాలకు చేసిన అన్యాయంలో అగ్నివీర్ ఒక శాంపిల్ మాత్రమే. వన్ ర్యాంక్ వన్ పెన్షన్, వికలాంగుల పెన్షన్ వంటి విధానాలు కూడా ఉన్నాయి" అని చౌదరి విమర్శించారు.

గత ఏడాది సెప్టెంబర్ 21న ప్రభుత్వం వికలాంగ సైనికుల కోసం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దీనివల్ల వారికి వచ్చే సాయం కూడా పన్ను పరిధిలోకి వస్తుంది. ఈ అన్యాయాలపై పోరాడేందుకు సాయుధ దళాలు, అనుభవజ్ఞుల సాయం తీసుకుంటామని అన్నారు.

డిసెంబర్ 23, 2022 న మోదీ ప్రభుత్వం వన్ ర్యాంక్, వన్ పెన్షన్ ఆమోదించింది. అయితే ఇది వివక్షాపూరితమైనదిగా మాజీ సైనికులు సమన్వయ కమిటీ ఆరోపించింది. కేవలం అధికారుల స్థాయి వరకే ఇది పని చేస్తుందని, కింది స్థాయి సిబ్బందికి ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించింది. ఈ సమస్యను కూడా రాహూల్ గాంధీ లేవనెత్తాలని అనుకుంటున్నారు.

అలాగే మా బృందంలోని ఒక సభ్యుడు అమరవీరునికి గౌరవంగా సందేశం అందించడానికి మరణించిన సైనికుడి భౌతియ కాయాన్ని సందర్శిస్తారు. ఇది గత సంవత్సరం నవంబర్ లో ప్రారంభించబడింది. అలాగే రిటైరయిన, ప్రస్తుతం సేవలందిస్తున్న సైనికులు అత్యధికంగా ఉన్న గ్రామాల్లో మా బృంద సభ్యుడిని నియమించి వారి సమస్యలను ఎప్పుటికప్పుడు తెలుసుకుని పార్టీ కి అందజేసేలా ప్రణాళికలు వేస్తున్నామని చౌధరి అన్నారు. పారామిలిటరీ బలగాలతో సహా దాదాపు 1.8 కోట్ల సాయుధ బలగాల కుటుంబాలతో జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ఏకీకరణ కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఇదీ మా ప్రణాళికలో ఒక భాగమని చౌధరి తెలిపారు.

Read More
Next Story