పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలుపు వ్యూహం ఏమిటి?
x

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలుపు వ్యూహం ఏమిటి?

పశ్చిమ బెంగాల్‌లో పట్టు సాధించడం బీజేపీకి అంత ఈజీ కాదు. ఈ సారి మతపర కార్యక్రమాలు చేపట్టడం ద్వారా జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది.


పశ్చిమ బెంగాల్ బీజేపీ మాజీ చీఫ్ దిలీప్ ఘోష్. ఈయన ప్రస్తుతం మేదినీపూర్ నియోజకవర్గం ఎంపీ. ఇప్పుడు తిరిగి అదే స్థానం పోటీ చేయవలసి రావడంతో పార్టీ నాయకులతో సమావేశాలు జరుపుతున్నారు వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని ప్రచారానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

అయితే నియోజకవర్గ పరిధిలోని చాలా బూత్‌లలో పార్టీకి కమిటీలు లేకపోవడం ఇబ్బందిగా మారింది. దీంతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో పనిచేసి, ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా మారిన ఘోష్ ప్రస్తుతం పరిస్థితులను చక్కద్దిదే పనిలో బిజీ అయ్యారు. ఇందుకోసం RSS సాయం కోరారు.

నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సంఘ్ సభ్యులు ఉన్నారు. అయితే రాష్ట్రంలోని 80,530 బూత్‌లలో దాదాపు 30% కమిటీలను ఏర్పాటు చేయడంలో పార్టీ విఫలమైందని ఘోష్ సన్నిహితుడు చెప్పారు. ఫలితంగా పార్టీ చేపట్టే కార్యక్రమాలు, చేసిన అభివృద్ధి పనులను గురించి ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వాసులకు వివరించే అవకాశం లేకుండా పోయిందన్నారు.

మనోభావాలను తెలుసుకున్న మోదీ..

మాల్దా జిల్లాకు చెందిన బీజేపీ సభ్యుడొకరు వర్చువల్ మీటింగ్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడారు. జిల్లాలో బీజేపీకి ఆదరణ తగ్గుతోందని చెప్పారు. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ నాయకులపై ఉన్న అవినీతి ఆరోపణలు గ్రామీణ ఓటర్లను ఏ మేర ప్రభావితం చేస్తాయన్న విషయం తెలుసుకునేందుకు మోడీ స్థానిక పార్టీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

మాల్డాకు చెందిన కార్మికుడు శుభంకర్ సాహా మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయకుండా కావాలని అడ్డుకుంటున్నారని కొంతమంది జనం నమ్ముతున్నారని చెప్పారు. పశ్చిమ బెంగాల్ పట్ల బిజెపి వైఖరి తప్పుబడుతూ దాన్నే తృణమూల్ కాంగ్రెస్ నాయకులు జనాల్లోకి తీసుకెళ్లడం ప్రారంభించారని తెలిపారు. టీఎంసీ నేతలు ‘‘ప్రజా గర్జన - బెంగాల్ వ్యతిరేక శక్తుల తొలగింపు’’ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

మోదీ మాట్లాడుతూ.. ఆర్థిక నివేదికలు సమర్పించని కారణంగా రాష్ట్రానికి నిధులు విడుదల ఆగిపోయిందన్న విషయాన్ని ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని బీజేపీ శ్రేణులను కోరారు.

బీజేపీకి అది ఎదురుదెబ్బే..

TMCలోని బలమైన వ్యక్తులు సందేశ్‌ఖాలీలో భూకబ్జాలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అక్కడ జరిగిన ఘటనలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేయాలని పార్టీ నేతలు భావించినా, దాన్నిజనం స్థానిక సమస్యగా మాత్రమే చూడటంతో వెనక్కు తగ్గారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA), 2019 అమలు చేస్తున్నామని చెప్పడం కూడా ఇక్కడ బీజేపీకి మరో ఎదురుదెబ్బ. మొత్తం మీద చాలా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు లేకపోవడంతో ప్రజలకు చేరువ కాలేకపోతున్నామన్న విషయాన్ని పార్టీ అగ్రశ్రేణి నేతలు గ్రహించారు.

బలహీనపడ్డ బీజేపీ..

2021 అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత పార్టీ తన ప్రాబల్యాన్ని కోల్పోయింది. చాలా మంది కార్మికులు TMCలో చేరారు. కొంతమంది తటస్థంగా ఉండిపోయారు. పార్టీ ఓట్ల శాతం 22.88 శాతానికి పడిపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన 38 శాతం ఓట్లతో పోలిస్తే ఇది గణనీయంగా తగ్గింది.

కీలకంగా మారిన RSS..

పార్టీ తిరిగి బలం పుంజుకునేందుకు, గోష్ తన నియోజకవర్గంలో చేస్తున్నట్టుగానే బీజేపీ ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌పై ఎక్కువగా ఆధారపడుతోంది. పార్టీ బలహీనంగా ఉన్న బూత్‌లు, బ్లాక్‌లలో సంఘ్ కార్యకర్తలను నియమిస్తోంది. వారి నుంచి సేకరించిన సమాచారంతో జనం వద్దకు చేరుకునందుకు రోడ్ మాప్ సిద్ధం చేస్తుంది.

పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, కార్నర్ మీటింగులు, ఇంటింటికీ ప్రచారం, ఇలా రకరకాలుగా బీజేపీ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధిని గురించి జనంలోకి తీసుకెళ్లేందుకు భారీ కసరత్తు చేస్తున్నారు.

మతపర కార్యక్రమాలు..

ఈ ఏడాది ఏప్రిల్ 9న ఉగాదిని (హిందూ నూతన సంవత్సరాన్ని) ఘనంగా నిర్వహించాలని సంఘ్ దాని అనుబంధ సంస్థలు నిర్ణయించాయి. హిందూ విశ్వాసాల ప్రకారం.. బ్రహ్మదేవుడు ఆ రోజున విశ్వాన్ని సృష్టించాడు. హిందూ పురాణాల ప్రకారం చైత్రమాసంలో ఇదే రోజున దశరథ రాజు రాముని పట్టాభిషేకాన్ని కూడా నిర్వహిస్తారు.

లోక్‌సభ పోరుకు రెండు రోజుల ముందు సంఘ్ అనుబంధ సంస్థలు ఏప్రిల్ 17న రామనవమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 5,000 ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి.

Read More
Next Story