GLENWALK | సంజయ్ దత్ స్కాచ్ విస్కీకి ఇంత గిరాకీనా!
2023 జూన్ లో ఆల్కహాల్ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సంజయ్ దత్ గ్లెన్‌వాక్ స్కాచ్ విస్కీ ప్రస్తుతం ఇండియన్ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt, Scotch Whisky, GLENWALK) ఎంత గొప్పనటుడో అంతటి మంచి వ్యాపారి అని కూడా రుజువైంది. తన నటనా కౌశలంతో ప్రేక్షకుల్ని కట్టిపడవేసే సంజయ్ దత్ ఇప్పుడు మద్యం ప్రియలనూ ఆకట్టుకుంటున్నారు. సరిగ్గా 18నెలల కిందట ఆయన మార్కెట్ లోకి తీసుకువచ్చిన స్కాచ్ విస్కీ ప్రస్తుతం ఇండియన్ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. సంజయ్ దత్ ఏమిటీ? ఆల్కహాల్ ఏమిటీ? అనే మీమాంశకు తావు లేకుండా ఆయన ఈ వ్యాపారంలోనూ దూసుకుపోతున్నారు. సంజయ్ దత్ కి దీంతో పాటు చాలా వ్యాపారాలూ ఉన్నాయి. అందులో ఇదొకటి.
2023 జూన్ లో ఆల్కహాల్ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సంజయ్ దత్ గ్లెన్‌వాక్ అనే బ్రాండ్ ను మార్కెట్ కి విడుదల చేశారు. ఇది ప్రీమియం స్కాచ్ విస్కీ. ది గ్లెన్‌వాక్‌కి బ్రాండ్ భాగస్వామి.
2023-2024 ఆర్ధిక సంవత్సరంలోని మొదటి ఏడు నెలల్లో 6,00,000 బాటిళ్లను విక్రయించడం ద్వారా గ్లెన్‌వాక్ ఓ రికార్డ్ సృష్టించింది. ఇండియన్ స్పిరిట్స్ మార్కెట్‌లో ఒకటిగా నిలిచింది. 10 రాష్ట్రాల్లో సంజయ్ దత్ బ్రాండ్ విస్కీని అమ్ముతున్నారు. 700 మిల్లీలీటర్ల గ్లెన్‌వాక్ స్కాచ్ బాటిల్ రూ. 1,599 నుంచి రూ. 1,600 మధ్య ఉంది. గత జూన్‌లో మార్కెట్లోకి ప్రవేశించిన గ్లెన్‌వాక్ భారతదేశం అంతటా విస్కీ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ స్కాచ్ విస్కీ ధర అందుబాటులో ఉండడంతో మందుబాబులు బాగానే కొంటున్నారు. గ్లెన్‌వాక్ నాణ్యమైన మాల్ట్, గ్రెయిన్ ల నుంచి తయారు చేస్తున్నట్టు తయారీదారులు చెబుతున్నారు. బ్రాండ్ అంబాసిడర్ గా సంజయ్ దత్ ఉన్నట్టు సమాచారం. సాంప్రదాయకంగా స్కాచ్ ను ఓక్ క్యాన్లలో నిల్వ చేస్తారు. ఎంతకాలం నిల్వ ఉంచితే అంత నాణ్యమైందన్న నానుడి ఉంది. మద్యం నిల్వ చేసే కాలాన్ని బట్టే మద్యం బాటిళ్లపై 8,12, 14,18..ఇలా ఇయ్యర్స్ రాస్తుంటారు. గ్లెన్ వాక చాలా స్మూత్ గా ఉందన్న పేరు వచ్చింది.
గ్లెన్ వాక్ స్కాచ్ ని ప్రస్తుతం పది రాష్ట్రాలు, కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రమే విక్రయిస్తున్నారు. గిరాకీ పెరిగిన నేపథ్యంలో త్వరలో దక్షిణాది రాష్ట్రాలలో కూడా విడుదల చేయనున్నారు. ఈ విస్కీని కార్టెల్ బ్రోస్ సంస్థ తయారు చేస్తోంది. సంజయ్ దత్, ఆయన టీమ్ మార్కెటింగ్ వ్యవహారాలను చూస్తోంది. స్కాచ్ తయారీలో కార్టెల్ బ్రోస్ సంస్థకి మంచి పేరుంది. సుదీర్ఘకాలంలో ఈ రంగంలో ఉన్న సంస్థ ఇది. మోక్ష్ సాని, జితిన్ మెరానీ- కార్టెల్ బ్రోస్ వ్యవస్థాపక సభ్యులు. నాణ్యమైన స్పిరిట్‌ల తయారీలో ఈ సంస్థ బాగా ఆరితేరింది. మోక్ష్ సాని భారతదేశపు ప్రీమియర్ ఆల్కహాల్ రిటైల్ చైన్‌లలో ఒకటైన లివింగ్ లిక్విడ్జ్ తో కలసి పని చేస్తూ ప్రత్యేకతను చాటుకున్నారు.
సంజయ్ దత్ పాపులారిటీ గ్లెన్ వాక్ బ్రాండ్ గిరాకీని పెంచడానికి ఉపయోగపడిందంటున్నారు.ఆయన డై-హార్డ్ అభిమానులను, విస్కీ అభిమానులను ఈ బ్రాండ్ బాగా ఆకర్షిస్తోంది.
గ్లెన్‌వాక్ కేవలం ప్రముఖులనే కాక విస్కీ రుచిని ఆస్వాదించే స్కాచ్ ప్రియులను, ఔత్సాహికులను ఆకట్టుకుంటున్నట్టు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గ్లెన్‌వాక్‌ని ఓసారి తాగి చూద్దామనే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
మొత్తం మీద ది గ్లెన్‌వాక్ విజయం మరికొందరు సినీనటులు ఆల్కహాల్ తయారీ రంగంలోకి ప్రవేశించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే అమృత్ అనే బ్రాండ్ అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు గ్లెన్ వాక్ దేశీయంగా సక్సెస్ సాధించడం గమనార్హం. గ్లెన్‌వాక్ ప్రస్తుతం మహారాష్ట్ర, హర్యానా, గోవా, డామన్, డయ్యూ, ఢిల్లీ, పంజాబ్, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌తో సహా కీలక మార్కెట్‌లలో అందుబాటులో ఉంది.
Next Story