బీఆర్ఎస్ పార్టీ ఖతం, కవిత సంచలన వ్యాఖ్యలు
x
Kavitha and KCR

బీఆర్ఎస్ పార్టీ ఖతం, కవిత సంచలన వ్యాఖ్యలు

అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుకాకపోవటాన్ని కవిత తీవ్రంగా తప్పుపట్టారు


బీఆర్ఎస్ ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. శుక్రవారం మీడియాతో మాట్లాడుతు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుకాకపోతే పార్టీ పని ఖతమైపోతుందని చేసిన వ్యాఖ్యలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్(KCR) ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమన్నారంటే(T Assembly Session) అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుకాకపోవటాన్ని కవిత తీవ్రంగా తప్పుపట్టారు. కేసీఆర్ అసెంబ్లీకి హాజరవ్వాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు సరైన సమాధానాలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరైతే పార్టీ పని ఖతమైపోతుందని జోస్యంచెప్పారు. కేసీఆర్ తప్పుచేయకపోతే సభకు ఎందుకు రావటంలేదు అని నిలదీశారు.

తాను సమావేశాలకు హాజరుకాకుండా సభ సమయాన్ని పిల్లకాకులకు వదలిపెట్టకూడదు అని సూచించారు. కవిత ఉద్దేశ్యంలో పిల్లకాకులు అంటే బహుశా కేటీఆర్, హరీష్, జగదీశ్వరరెడ్డి తదితరులన్న ప్రచారం మొదలైపోయింది. కేసార్ సమావేశాలకు రాకపోవటంపై కూతురిగా తన రక్తం ఉడికిపోతోందని చెప్పారు.

అలాగే మాజీమంత్రి, ఎంఎల్ఏ తన్నీరు హరీష్ రావు గురించి మాట్లాడుతు ‘హరీష్ రావు ఒక బచ్చా’ అని చెప్పారు. ‘ఆయనకు ప్యాకేజీలు తీసుకోవటం తప్ప ఇంక ఏమి తెలుసు’ అని ఎద్దేవాచేశారు. కేసీఆర్ సభకు రాకపోతే హరీషే అన్నీ చూసుకోవటం మంచిదికాదని కేసీఆర్ కు కవిత సలహా ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు కేసీఆర్ సభకు వచ్చి సమాధానాలు చెప్పితీరాల్సిందే అని గట్టిగా చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పక్కనపెట్టిన కేసీఆర్ ను ఉరితీయాలని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కవిత మండిపడ్డారు. కేసీఆర్ మీద రేవంత్ భాష ఏమాత్రం బాగాలేదన్నారు. కేసీఆర్ ను ఒకసారి ఉరితీయాలని అంటే రేవంత్ ను పదిసార్లు ఉతి తీయాలని తెలిపారు. సొంతజిల్లా మహబూబ్ నగర్ కు రేవంత్ ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారో చెప్పాలని కవిత నిలదీశారు.

Read More
Next Story