బీజేపీలో చేరనున్న కలకత్తా హైకోర్టు జడ్జి
కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ తన పదవికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..
అందుకే ఈ నిర్ణయం..
‘‘టీఎంసీ నేతలు నా గురించి గత కొంతకాలంగా అవమానకరంగా మాట్లాడుతున్నారు. వారికి తీర్పు నచ్చకపోతే న్యాయమూర్తిపై దుర్భాషలాడగం తగదు. వారి ప్రవర్తనే నన్ను రాజకీయాల వైపు నడిపించింది. బెంగాల్‌లో అవినీతికి పర్యాయపదం టీఎంసీ. అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నా. నేను మార్చి 7న బిజెపిలో చేరబోతున్నా. అయితే ‘‘నేను పోరాడాలా? వద్దా? అనేది బీజేపీ అధినాయకత్వమే నిర్ణయిస్తుంది. వారు ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తా’’ అని చెప్పారు.
‘టీఎంసీకి రోజులు దగ్గర పడ్డాయి.’
"పశ్చిమ బెంగాల్‌లో TMC కి రోజులు దగ్గరపడ్డాయి.CPI (M) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ 2009 లోక్‌సభ ఎన్నికలలో పరాజయం పాలైంది. చివరికి 2011 అసెంబ్లీ ఎన్నికలలో వారి ఓటమికి దారితీసింది. TMC కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది, "అని పేర్కొన్నాడు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు గంగోపాధ్యాయ స్పష్టత ఇవ్వలేదు.
"నేను గత కొన్ని రోజులుగా సెలవులో ఉన్నాను. బిజెపితో టచ్‌లో ఉన్నాను. వారు నన్ను కూడా సంప్రదించారు. టిఎంసిపై పోరాటానికి ఇదే సరైన వేదికగా నేను భావించాను" అని గంగోపాధ్యాయ అన్నారు.
గంగోపాధ్యాయ తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అలాగే CJI DY చంద్రచూడ్, కలకత్తా HC ప్రధాన న్యాయమూర్తి TS శివజ్ఞానంకు ఈ రోజు ఉదయం పంపారు.
గంగోపాధ్యాయ మే 2, 2018న కలకత్తా హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా చేరారు. జూలై 30, 2020న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.