యూఎస్ ఆంక్షలను భారత్ తట్టుకోగలదా?
కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలు విధించిన ట్రంప్
సునీత కౌల్
ట్రంప్ అనుకున్నంత పని చేశాడు. మెక్సికో, కెనడా, చైనా నుంచి అమెరికా వస్తున్న వస్తువులపై దిగుమతి సుంకాలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు.
ఇది తన టారిఫ్ లో తొలిభాగం మాత్రమే అని మనకు స్పష్టంగా తెలుస్తోంది. టారిఫ్ వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే రంగాలను కూడా ఆయన వెల్లడించినట్లు అవుతోంది.
ఫార్మాస్యూటికల్స్, చిప్స్, స్టీల్, అల్యూమినియం, రాగి వంటివి అతని హిట్ లిస్ట్ లో ఉన్నాయి. ట్రంప్ ఎక్కడా కూడా స్వదేశీ తయారీని ప్రొత్సహించడానికి దిగుమతులపై టారిఫ్ లు విధిస్తూ రక్షణాత్మక విధానాన్ని అనుసరిస్తున్నానని ట్రంప్ ఎక్కడా చెప్పలేదు.
భారత్ కు టారిఫ్ ముప్పు..?
ట్రంప్ బాధ్యతలు స్వీకరించడానికంటే ముందే భారత్ పై కూడా టారిఫ్ లు విధించబోతున్నట్లు ప్రకటించేశారు. కానీ మొదటి విడతలో మన పేరు మాత్రం లేదు.
దీనిపై మనదేశం ఆందోళన చెందుతోంది. ఏప్రిల్- నవంబర్ లో భారత్, అమెరికాకు.. 5.8 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను ఎగుమతి చేసింది. 2023-24 లో యూఎస్ కు ఫార్మా ఎగుమతులు దాదాపుగా 8 బిలియన్ డాలర్ల మార్క్ కు చేరుకున్నాయి.
యూఎస్ కు వస్తున్న జనరిక్ ఔషధాలలో భారత్ వే 40 శాతం వరకూ ఉంటాయి. తరువాత యూరప్ కు ఈ స్థానంలో ఉంది. అలాగే ఉక్కు ఉత్పత్తి, ఎగుమతులు కూడా 2.3 బిలియన్ డాలర్లుగా, అల్యూమినియం 516 మిలియన్లుగా ఉన్నాయి.
అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై ఇతర దేశాలు ఏవిధంగా సుంకాలు విధిస్తున్నాయో.. తమ దేశంలోకి దిగుమతి అవుతున్న ఆదేశ వస్తువులపై అలాగే సుంకాలు విధిస్తామని వైట్ హౌజ్ ప్రతినబూనింది.
భారత్ కు తట్టుకునే శక్తి ఉంది..
సుంకాల విషయంలో భారత విధాన రూపకర్తలు ఓ స్పష్టమైన ఆలోచనతోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఏడు టారిఫ్ కస్టమ్స్ రేట్లను తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
సవరణ తర్వాత ఎనిమిది టారిఫ్ రేట్లను మాత్రమే ఉంచారు. అమెరికా ఎగుమతిదారులు మన దేశ పన్నూ రేట్లపై చాలా సంవత్సరాలుగా ఫిర్యాదులు చేస్తున్నారు. దాంతో వాటికి చెల్లు చీటి పాడేశారు. కానీ కస్టమ్ మూల్యాంకన విధానం, విచక్షణతో కూడిన స్వభావం తాత్కాలిక సర్ధుబాట్లు, ఏకపక్ష పరిపాలనా జోక్యానికి అవకాశం ఇస్తుంది.
కొన్ని వైద్య, రోగనిర్ధారణ పరికరాలపై మార్కెట్ పన్నులను తగ్గించాలనేది యూఎస్ వాణిజ్య ప్రతినిధుల దీర్ఘకాల డిమాండ్. ఉదాహారణకు.. స్టెంట్లపై, దేశీయ స్టెంట్లు, విదేశీ స్టెంట్ల ధరలో సగం.
యూఎస్ కంపెనీలు సరఫరాపై చాలా ఆసక్తిని పెంచుకుంటున్నాయి. ప్రాణాలను రక్షించే వైద్య పరికరాలపై సుంకాలను పూర్తిగా తొలగిస్తున్నట్లు 2025 బడ్జెట్ ప్రకటన స్థానిక భారతీయ తయారీదారులకు వారి పోటీతత్వాన్ని కొనసాగించడం కష్టతరం అవుతుంది.
వాణిజ్య అసమతుల్యత..
అమెరికా వర్తక ప్రతినిధులు చాలాకాలంగా ప్రపంచ ఆరోగ్య జాబితాలో ఉన్న ప్రాణాలను రక్షించే మందులకు ఎక్కువ మొత్తంలో సుంకాలు విధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది. వాటిని తగ్గించడానికి అన్ని దేశాలతో చర్చలు జరుపుతోంది. తాజాగా భారత్ బడ్జెట్ సంస్కరణల్లో భాగంగా వాటిపై దిగుమతి సుంకాలు చాలామటుకు తగ్గించింది.
అయితే భారత్, ట్రంప్ బెదిరింపులకు లొంగిపోయిందా? భారత్ - అమెరికాతో చేస్తున్న వాణిజ్యంలో దిగుమతి లోటు 2022 లో 45.7 బిలియన్లు గా ఉంది. ఇందులో దేశం నుంచి 73 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 118 బిలియన్ డాలర్ల దిగుమతులు ఉన్నాయి.
దిగుమతులపై 10 శాతం దాకా మనం పన్నులు విధిస్తున్నామని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీనిని సరిచేయవచ్చని అంటున్నారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తులపై మన దేశం క్రమతప్పకుండా సర్ చార్జీలను మారుస్తుంది.
నాన్ టారిఫ్ అడ్డంకులు..
దిగుమతులపై నాన్ టారిఫ్ అడ్డంకులు ఎక్కువగా రాష్ట్రస్టాయిలో వస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ లో దేశీయ ఉత్పత్తిని పెంచే సామర్థ్యం దేశానికి లేనందున ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్ లపై సుంకాలు తొలగించడం పెద్దగా సాయపడదు. ఎలక్ట్రానిక్, సెల్ ఫోన్ తయారీదారులకు పన్ను, కార్పొరేట్ ప్రొత్సహాకాలు యూఎస్ లో వారి ఉత్పత్తిని మరింత లాభదాయకంగా చేస్తున్నాయి.
అయితే తయారీకి టారిఫ్ లు మాత్రమే అడ్డంకి కాదు. అడ్డంకులు తొలగించినప్పటికీ రాష్ట్ర స్థాయిలో సహా చాలా ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. ఉదాహారణకు ఐఫోన్ లను తయారు చేసే ఫాక్స్ కాన్ సంస్థ అనేక అడ్డంకులను ఎదుర్కొంది. దానికి ఇంకా పర్యావరణ క్లియరెన్స్ ఉంది’’ అని చెన్నైలోని ఒక ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేస్తున్న నిశాంత్ రవిచంద్రన్ వ్యాఖ్యానించారు.
సెమీకండక్టర్స్, డై కాస్టింగ్ వంటి పరిశ్రమలలో ఉపయోగించే గాలియం నైట్రైట్ పై 80 శాతం నుంచి 100 వరకూ సుంకాలు విధిస్తున్నారు. దానిపై బడ్జెట్ లో ఉపశమనాన్ని పొందలేదని నిశాంత్ అభిప్రాయపడ్డారు. ‘‘ఈ దిగుమతుల్లో ఎక్కువ భాగం చైనా నుంచి వస్తున్నాయి.
అధిక టారిఫ్ ల కారణంగా, ఆటో మొబైల్ డిఫెన్స్ పరిశ్రమల నుంచి తుది ఉత్పత్తులు, ధరలో 30 నుంచి 40 శాతం వరకూ పెరుగుతాయి. అవి పర్యావరణ అనుకూలమైనవి కావు. అయితే పర్యావరణానికి అనుకూలమైన అన్ని ఉత్పత్తులను మనం తీసివేస్తే దేశంలో తయారీరంగం అంటూ ఏదీ ఉండదు.
గట్టీ పోటీ ఉండదు..
భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ సహాయ్ మాట్లాడుతూ.. హై ఎండ్ ఇంజనీరింగ్ ఉత్పత్తులు లేదా ఎలక్ట్రానిక్స్ పై యూఎస్ సుంకాలు, వాటి తయారీని యూఎస్ నుంచి వియత్నాంకు, చైనా నుంచి వియత్నాంకు, తరువాత భారత్ కి కూడా మారుస్తున్నాయి.
వియత్నాం లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్ లో స్థలాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వారికి శ్రమశక్తి అవసరమైనంత లేదు. భారత్ పోటీపడే తయారీ అవకాశాలు ఇవే’’ అన్నారు.
దేశంలో ఉత్పత్తి చేసే అమెరికన్ కంపెనీలు తక్కువ ఖర్చుతో ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే వారి ఉత్పత్తులపై కూడా సుంకాలు విధిస్తారు. ఈ ఉత్పత్తులు ఎక్కడా చేసినా అమెరికా చేరగానే వాటిపై సుంకాలు విధిస్తారు.
ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువులు, సేవల ఎగుమతులను వేగవంతం చేయడానికి ట్రంప్ పరిపాలన లేవనెత్తే వివాదాస్పద అంశాలకు భారతీయ విధాన రూపకర్తలు ముందుగానే ఊహించి పరిష్కారాలు కనుగొన్నారా? మన దేశ చాలాకాలంగా ఆ దేశంతో చర్చలు జరుపుతోంది. ఒపెన్ స్కై టెలికాం, శాటిలైట్ పాలసీకి ఇదే నాంది? ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు ప్రతిఫలంగా ఏం చేయబోతున్నారో చూడాలి.
Next Story