తమిళనాడులో బీజేపీ ప్రముఖులపై పోటీ చేసే అభ్యర్థులెవరు?
కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా కె.అన్నామలైని బిజెపి ప్రకటించింది. నీలగిరి నుంచి కేంద్ర మంత్రి ఎల్ మురుగన్‌ను కూడా పోటీకి దింపారు.
కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా కె.అన్నామలైని బిజెపి ప్రకటించింది. నీలగిరి నుంచి కేంద్ర మంత్రి ఎల్ మురుగన్‌ను కూడా పోటీకి దింపారు. చెన్నై సౌత్ లోక్‌సభ స్థానం నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను, కన్యాకుమారి నుంచి కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్‌ను పార్టీ నామినేట్ చేసింది.
మాజీ ఏఐఎస్ అధికారి అయిన అన్నామలై 2021లో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీ గెలుపునకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం కోయంబత్తూరు డిఎంకె మిత్రపక్షమైన సిపిఐ (ఎం) ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ సారి అన్నామలైపై డీఎంకే తరుపున గణపతి పి రాజ్‌కుమార్, ఏఐఏడీఎంకే తరుపున సింగై జీ రామచంద్రన్ పోటీ చేస్తున్నారు.
నీలగిరి నుంచి బరిలో నిలుస్తున్న కేంద్ర మంత్రి మురుగన్‌కు ప్రస్తుత ఎంపి, డిఎంకె హెవీ వెయిట్, ఎ రాజాతో తలపడనున్నారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో తూత్తుకుడిలో కనిమొళిపై ఓడిపోయిన తమిళిసై సౌందరరాజన్ ఇప్పుడు దక్షిణ చెన్నై నుంచి బరిలో నిలుస్తున్నారు. ఇక్కడ బీజేపీకి కొంత మద్దతు ఉంది. మృదుస్వభావి అయిన తమిళిసైకి ఇక్కడి ప్రజల మద్దతు ఉంది. తమిళిసై మార్చి 18న తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈమెపై సిట్టింగ్ ఎంపి టి సుమతిని బరిలోకి దింపింది డిఎంకే.
పొన్ రాధాకృష్ణన్. ఈయన కేంద్ర మాజీ మంత్రి. 2014లో తమిళనాడు నుంచి బిజెపి తరపున గెలుపొందిన ఏకైక అభ్యర్థి. ఆ సంవత్సరం 39 స్థానాల్లో 37 గెలుచుకుంది. కాషాయ పార్టీ ఆ ఏడాది దేశవ్యాప్తంగా 282 సీట్లు గెలుచుకుంది. రాధాకృష్ణన్ సీనియర్ నాయకుడు ఏఐఏడీఎంకేకు చెందిన బసిలియన్ నజ్రెత్‌తోనూ, ఇంకా నామినీని ప్రకటించని కాంగ్రెస్‌తోనూ తలపడనున్నారు.