‘‘మోదీని ముక్కలు చేస్తా’’ అన్నదెవరు?
x

‘‘మోదీని ముక్కలు చేస్తా’’ అన్నదెవరు?

ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి అన్బరసన్‌ పై కేసు నమోదైంది.


తమిళనాడు డీఎంకే మంత్రిపై కేసు నమోదైంది. చెన్నైలో జరిగిన బహిరంగ ర్యాలీలో గ్రామీణ, కుటీర చిన్నతరహా పరిశ్రమల మంత్రి అన్బరసన్‌ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘మోదీని ముక్కలు చేస్తా" అని అనడంతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సుప్రీంకోర్టు న్యాయవాది సత్యరంజన్ స్వైన్ ఫిర్యాదు మేరకు బుధవారం (మార్చి 13) పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

"అన్బరసన్ చేసిన వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, ఇండియన్ పీనల్ కోడ్ (IPC) 153, 268, 503, 505,506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అన్బరసన్ ప్రసంగ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, విచారణ జరుగుతోందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

మంత్రి అన్బరసన్ ప్రసంగం వీడియోను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ట్విట్టర్‌లో షేర్ చేశారు. తమిళనాడులో అధికార వ్యతిరేకత పెరిగిపోవడంతో డీఎంకే మంత్రులు దూకుడుగా వ్యవహరిస్తున్నారని, ప్రధాని మోదీని కూడా బెదిరిస్తున్నారని అన్నారు. విభజన రాజకీయాలు, అవినీతి, అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యాపారులతో సంబంధాలు, గూండాయిజం కారణంగా డీఎంకే త్వరలో రాజకీయాల నుంచి కనుమరుగవుతుందని అన్నామలై పేర్కొన్నారు.

Read More
Next Story