కాశ్మీర్ తో కేంద్రం ఆర్టికల్ 311 ఆట
x
jammu and kashmir

కాశ్మీర్ తో కేంద్రం ఆర్టికల్ 311 ఆట

జమ్ము కాశ్మీర్ లో కేంద్రం గత కొద్ది కాలంగా అధికరణ 311(2) అమలు చేస్తోంది. తాజాగా ఆ నిబంధనను ఉపయోగించుకుని నలుగురు ప్రభుత్వ అధికారులను జే అండ్ కే లెప్టినెంట్ గవర్నర్ విధుల నుంచి తొలగించారు. జమ్ము కాశ్మీర్ రాష్ట్ర భద్రతకు వీరు నలుగురు ముప్పుగా పరిణమించారని ఆ రాష్ట్ర పాలనా విభాగం ప్రకటించింది


ఉద్యోగం నుంచి తొలగించిన వారిలో కాశ్మీర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నిసార్-ఉల్- హసన్, పోలీస్ కానిస్టేబుల్ అబ్దుల్ మజీద్ భట్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఫరూక్ అహ్మద్ మీర్, ఉన్నత విద్య ప్రయోగ శాల బేరర్ అబ్దుల్ సలామ్ రాథర్ ఉన్నారు.

ఏమిటీ అధికరణ 311(2)?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులపై విచారణ, వారి ప్రవర్తననకు సంబంధించి ఎలాంటి వివరణ తీసుకోకుండా విధుల నుంచి తొలగించడానికి రాజ్యంగం వీలు కల్పిస్తుంది. ఈ నిబంధనన జమ్ముకాశ్మీర్ లో మొదట 2020లో వినియోగించి డీఎస్పీ దవీందర్ సింగ్ ను విధుల నుంచి తొలగించారు. హిజ్బుల్ ఉగ్రవాదులు ఉన్న ప్రదేశాన్ని పోలీసులు చుట్టుముట్టినప్పుడు డీఎస్పీ దవీందర్ సింగ్ రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డారు.

ఈ సంఘటనతో మొదట ఆయనను అధికరణ 311 ప్రకారం విధుల నుంచి తొలగించారు. తరువాత ఇదే కోవలో ఉన్న మరో 50 మంది ప్రభుత్వ ఉద్యోగులను లెప్టినెంట్ గవర్నర్ విధుల నుంచి తప్పించారు. వీరితో దేశ భద్రతకు ముప్పు వాటిల్లడం, ఆయుధాల అక్రమ రవాణా , తీవ్రవాదుల తరఫున డబ్బు వసూలు చేయడం, బెదిరింపులు, కీలక ప్రభుత్వ సమాచారం బయటకు చేరవేయడం లాంటి ఆరోపణలు వచ్చాయి. వీటిన్నింటి దృష్ట్యా కేంద్రం ప్రభుత్వం మద్దతుతో జమ్ముకాశ్మీర్ పాలనా విభాగం ఈ ఆర్టికల్ ను ప్రయోగిస్తోంది.

Read More
Next Story