ఫార్ములా ఈ-కార్ రేస్‌ కేసులో కీలక పరిణామం
x

ఫార్ములా ఈ-కార్ రేస్‌ కేసులో కీలక పరిణామం

కేటీఆర్‌పైన చర్యలకు రంగం సిద్ధమవుతోందా!


ఫార్ములా కార్ కేసులో హైకోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయడానికి ఏసీబీ సిద్ధమవుతోంది. ఫార్ములా కేసులో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అర్వింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌కు కేంద్ర హోంశాఖ పరిధిలోని డీఓపీటీ అనుమతి ఇచ్చింది. ఇన్ని నెలలుగా డీఓపీటీ నుంచి అనుమతి కోసమే తెలంగాణ ఏసీబీ వేచిచూస్తోంది. తాజా పరిణామంతో నిందితులపై ఏసీబీ సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశాలు పెరిగాయి. ఇప్పటికే ఏ1 గా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పైన చర్యలకు రాష్ట్ర గవర్న్ జిష్ణుదేవ్ వర్మ ఇదివరకే అనుమతించారు. అయితే కేసులో కీలక సాక్షి అయిన అర్వింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి కోసమే ఏసీబీ ఇన్ని రోజులు వేచి చూస్తోంది. ఇప్పుడు దానికి కేంద్రం నుంచి అనుమతులు దక్కడంతో కేటీఆర్‌పై కూడా యాక్షన్ తీసుకోవడానికి ఏసీబీ రంగం సిద్ధం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కేసులో ఈడీ మనీలాండరింగ్ కోణంలో కూడా కేటీఆర్, అర్వింద్ కుమార్‌పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

Read More
Next Story