రామ మందిర ట్రస్ట్‌లో సంచలనం.. చంపత్ రాయ్ రాజీనామా ఆమోదం!
x

రామ మందిర ట్రస్ట్‌లో సంచలనం.. చంపత్ రాయ్ రాజీనామా ఆమోదం!

రామ మందిర విరాళాల వివాదం మధ్య కీలక పరిణామం. చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల రాజీనామాలను ట్రస్ట్ ఆమోదించింది.


Click the Play button to hear this message in audio format

అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో.. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామాలను ఆమోదించింది.

ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మాట్లాడుతూ, ఈ వివాదం ట్రస్ట్ సభ్యులందరినీ తీవ్రంగా కలిచివేసిందన్నారు. దొంగతనం చిన్నదా, పెద్దదా అన్నది కాకుండా, అలాంటి పరిస్థితి ఏర్పడటమే బాధాకరమని చెప్పారు.

చంపత్ రాయ్ మాట్లాడుతూ, ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగి, దోషులకు శిక్ష పడే వరకు తాను పదవిలో కొనసాగడం సరైంది కాదని భావించి రాజీనామా చేసినట్లు తెలిపారు. ట్రస్ట్ నియమావళి ప్రకారం రాజీనామా సమర్పించిన వెంటనే అది అమల్లోకి వస్తుందని సమావేశంలో వివరించారు.

మొదట జూలై 11న జరగాల్సిన ట్రస్ట్ సమావేశాన్ని ముందుకు జరిపి జూలై 6నే నిర్వహించారు. ఈ సమావేశానికి ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్‌తో పాటు ఇతర ట్రస్టీలు, అయోధ్య జిల్లా కలెక్టర్ శశాంక్ త్రిపాఠి హాజరయ్యారు.

ఇదిలా ఉండగా, రామ మందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతోంది.

Read More
Next Story