తెలంగాణ రాజకీయాల్లోనూ  చంద్రబాబు, జగనే కీలకమా ?
x
Chandrababu and YS Jagan

తెలంగాణ రాజకీయాల్లోనూ చంద్రబాబు, జగనే కీలకమా ?

కొద్దిరోజులుగా (Telangana politics)తెలంగాణరాజకీయాలు చంద్రబాబు, జగన్ కేంద్రంగానే తిరుగుతున్నాయి


సమైక్యరాష్ట్రం విడిపోయి ఆంధ్రా, తెలంగాణగా ఏర్పడి 11 ఏళ్ళయినా ఇంకా తెలంగాణరాజకీయాల్లో నారా చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. తెలంగాణ రాజకీయాల్లో(Chandrababu Naidu) చంద్రబాబు, జగనే(YS Jaganmohan Reddy) కీలకం కాబోతున్నారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. కొద్దిరోజులుగా (Telangana politics)తెలంగాణరాజకీయాలు చంద్రబాబు, జగన్ కేంద్రంగానే తిరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో నీటిప్రాజెక్టుల రాజకీయం నడుస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం (BRS)బీఆర్ఎస్ మధ్య వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. బీఆర్ఎస్ ఎంఎల్ఏ తన్నీరు హరీష్ రావు మాట్లాడుతు చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకే(Revanth) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టును పట్టించుకోవటంలేదని పదేపదే ఆరోపిస్తున్నారు.

దీనికి కౌంటరుగా రేవంత్, మంత్రులు మాట్లాడుతు జగన్ హయాంలో ఏపీలోని పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం ఎత్తు పెంచటంకోసం తెలంగాణ ప్రయోజనాలను కేసీఆర్ కుదవబెట్టారు అని ధీటుగా ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కృష్ణా జలాల్లో 299 టీఎంసీల వాటా చాలని ఒప్పందంపై కేసీఆర్ చేసిన సంతకమే ఇపుడు తెలంగాణ ప్రాజెక్టులకు శాపంగా మారినట్లు రేవంత్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తుతున్నారు. హరీష్ ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు, రేవంత్ ను కలిపి ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ ప్రయోజనాల కోసమే రేవంత్ పనిచేస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు.

ఇదేసమయంలో రేవంత్, ఉత్తమ్ ఎప్పుడు మాట్లాడినా జగన్, కేసీఆర్ కు ముడిపెట్టి ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం ఎత్తును పెంచేందుకు జగన్ ప్రభుత్వానికి కేసీఆర్ పూర్తిగా సహకరించిన కారణంగానే ఇపుడు తెలంగాణ ఇబ్బందులు పడుతోందంటు మండిపోతున్నారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి లభ్యతపై జూరాల నుండి ఎక్కువ నీటిని తీసుకునే అవకాశాలను కేసీఆర్ కావాలనే వదులుకున్నారని రేవంత్ ఆరోపిస్తున్నారు. జూరాల నుండి ఎక్కువ నీటిని తీసుకునే అవకాశాన్ని వదులుకున్న కేసీఆర్ ఏపీ ప్రయోజనాలను కాపాడేందుకే తక్కువ నీటిలభ్యతకు అవకాశమున్న తోకలాంటి శ్రీశైలం ప్రాజెక్టు నుండి నీటిని తీసుకునేందుకు అంగీకరించి సంతకాలు చేయటంతోనే మహబూబ్ నగర్ కు తీరని నష్టం జరిగిందని మండిపోతున్నారు. కాళేశ్వరం అవినీతి డబ్బునే జగన్ అవసరాల కోసం కేసీఆర్ సర్దుబాటు చేశారని మంత్రులు పదేపదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

తెలంగాణకు సమైక్య రాష్ట్రంలో జరిగిన నష్టంకన్నా పదేళ్ళ కేసీఆర్ పాలనలో జరిగిన నష్టమే చాలా ఎక్కువని కేసీఆర్ పైన రేవంత్, ఉత్తమ్ ధ్వజమెత్తుతున్నారు. అందుకనే కేసీఆర్, హరీష్ ను తెలంగాణ జలద్రోహులుగా రేవంత్ పదేపదే ఆరోపిస్తున్నారు. నిజానికి తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్ళు, నియామకాలు, నిధుల పేరుతో. నిధులూ లేక, నియామకాలు జరగకపోవటంతోనే కేసీఆర్ పాలనపై అన్నీవర్గాలు మండిపోయాయి. దీని ఫలితంగానే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి. రాబోయే ఎన్నికల్లో జలవివాదాలే తెలంగాణ రాజకీయాల్లో కీలకం కాబోతున్నట్లు అర్ధమవుతోంది.

ప్రాజెక్టులపై ఇపుడు జరుగుతున్న చర్చలను గమనిస్తుంటే కేసీఆర్ వల్ల నీళ్ళకు కూడా ద్రోహం జరిగిందని అర్ధమైపోతోంది. కేసీఆర్, హరీష్ నిర్వాకాల మీద రేవంత్, ఉత్తమ్ ఆరోపణలు చేయటం కాదు సొంతకూతురు బీఆర్ఎస్ ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఆరోపణలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన దృష్టి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఎందుక పెట్టలేదో చెప్పాలని కేసీఆర్ ను కవిత డిమాండ్ చేస్తున్నారు. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని కవిత పదేపదే ఆరోపిస్తున్నారు. కవిత ఆరోపణలు చూస్తుంటే కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులకు నీటికేటాయింపుల అన్యాయంతో పాటు ప్రాజెక్టుల నిర్మాణంలో భారీఅవినీతి జరిగిందన్న విషయం అర్ధమైపోతోంది. తమపై ఆరోపణలను బీఆర్ఎస్ నేతలు ఎలాగైనా సమర్ధించుకోవచ్చు, అయితే జనాలు ఎలాగ చూస్తున్నారు అన్నదే కీలకం.

Read More
Next Story