అమరావతి నిర్మాణం జోరుగా... పనుల్లో రోజూ 20 వేల మంది కార్మికులు
x

అమరావతి నిర్మాణం జోరుగా... పనుల్లో రోజూ 20 వేల మంది కార్మికులు

అమరావతి కన్ స్ట్రక్షన్ ‘ప్రోగ్రెస్ రిపోర్టు’ ఇదే...


రాజధాని నిర్మాణ పనులు ఎలా సాగుతున్నాయో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన ఆసక్తికరమయిన వివరాలు:


1. అమరావతి రాజధాని నిర్మాణం జోరుగా సాగుతున్నది. మొత్తం రూ.57,821 కోట్ల విలవైన పనులు వివిధ దశల్లో సాగుతున్నాయి.

2. హౌసింగ్, రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణం సాగుతూ ఉంది.

3. వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన, రద్దు చేసిన పనులకు సంబంధించి ఉన్న వివాదాలు, సమస్యలు పరిష్కరించి సీఆర్డీఏ పనులను పునరుద్ధరించింది.

4. నిర్మాణ వ్యయం పెరగడం సహా పలు సవాళ్లను అధిగమించి టెండర్లు పూర్తి చేసి పనులు అప్పగించారు.

4. ప్రస్తుతం రాజధానిలో 20 వేల మంది కార్మికులు, నిపుణులు పనులు చేస్తున్నారు.

5. రాజధాని పనుల్లో 5,580 మెషినరీ అవసరముండగా... ప్రస్తుతం 3767 మెషనరీ ఉంది. ఇవి కాకుండా హాట్ మిక్స్ 16, వెట్ మిక్స్ మెషిన్లు 36, ఆర్ఎంసీ మిషన్లు 34 ఉన్నాయి.

6. వారానికి రూ. 941 కోట్ల విలువైన పనులు పూర్తి కావాలి.

7. రాజధాని పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్ సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇసుక, గ్రావెల్ కొరత కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం జరిగే పరిస్థితి రాకూడదు.

8. ఫారెస్ట్ అధికారులతోనే అసలు సమస్య వస్తోందనే విషయం సీఎం దృష్టికి వచ్చింది. దీనిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

9. పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థల తీరు పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు:

ఈ రోజు ముఖ్యమంత్రి అమరావతి పనులును సమీక్షించారు. సమావేశంలో మంత్రులు, కలెక్టర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

రాజధాని నిర్మాణమనేది కేవలం ఒక కాంట్రాక్ట్ వర్క్ గా చూడొద్దు... ఇప్పుడు పనులు చేపట్టే వారంతా చరిత్రలో భాగస్వాములువుతున్నట్టే.

ఏ నిర్మాణ సంస్థ ఎంత మేర పనులు చేసింది...టార్గెట్ ను ఎంత మేరకు చేరుకున్నారనే విషయంలో పనుల వారీగా సమీక్ష సాగింది.

ఎంత మంది కార్మికులు పని చేయాలి, ఎంత మంది పనిచేస్తున్నారు... ఎంత మిషనరీ ఉపయోగించాలి, ఎంత ఉపయోగిస్తున్నారు అనే విషయంపై సమగ్ర చర్చవారం, నెల టార్గెట్ పెట్టుకుని పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన

వర్షాకాలం వచ్చే సమయానికి పూర్తి చేయాల్సిన పనులపై తాము పెట్టుకున్న లక్ష్యాలను వివరించిన అధికారులు

నిర్మాణ సంస్థలుగా మీరు ఎన్నో ప్రాజెక్టులు చేసి ఉంటారు...కానీ రాజధాని నగరాన్ని నిర్మించే అవకాశం అందరికీ దక్కదు.

రాజధానిని అద్భుతంగా, వినూత్నంగా నిర్మించేందుకు అపార అవకాశాలున్నాయి.

అమరావతిని ఫ్యూచర్ సిటీగా నిర్మించాలనే ప్రభుత్వ ఆలోచనను క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపించాల్సింది మీరే

నాణ్యతతో నిర్మాణాలు ఉండాలి... కాస్ట్ ఎఫెక్టివ్ చర్యలు తీసుకోవాలి... గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ వంటి వాటిని వినియోగించుకోవాలి.

రాజధాని ప్రతిష్టను పెంచేలా ఎవరికైనా ఆలోచనలు వస్తే వాటిని ప్రభుత్వంతో పంచుకోవచ్చు.

ప్రభుత్వం నిర్ధేసించిన సమయానికి నిర్మాణం పూర్తి చేసి తీరాల్సిందే.. ఈ విషయంలో ఏ మాత్రం రాజీ ఉండదు.

మ్యాన్ పవర్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది... ప్రతి నిర్మాణం సకాలంలో పూర్తి చేసి ప్రారంభించుకోవాలి.

Read More
Next Story