
డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు
ఇపుడున్న రెండంచెల విధానం ప్లేసులో మూడంచెల విధానాన్ని అమలుచేయాలని డిసైడ్ చేశారు ఉన్నతాధికారులు
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే ప్రొసీజర్లో రవాణాశాఖ మార్పులు చేయబోతోంది. ఇపుడున్న రెండంచెల విధానం ప్లేసులో మూడంచెల విధానాన్ని అమలుచేయాలని డిసైడ్ చేశారు ఉన్నతాధికారులు. కాకపోతే మూడంచెల విధానాన్ని ఎప్పటినుండి అమల్లోకి తీసుకుని రావాలి అనే విషయంపైన ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఈ విషయాలపై క్లారిటి కోసమే ఐదుగురు నిపుణుల కమిటీని రవాణాశాఖ నియమించింది. కమిటి తనరిపోర్టును అందించగానే మూండంచెల విధానం అమల్లోకి రావటం ఖాయం.
ఇంతకీ రెండంచెల విధానానికి మూడంచెల విధానానికి తేడా ఏమిటి ? ఏముంటుంది ? అనే విషయాలను చూద్దాం. ముందు ఇపుడున్న రెండంచెల విధానం ఏమిటి ? ఏమిటంటే ముందు ఎల్ఎల్ఆర్ తీసుకోవటం. ఈ ఎల్ఎల్ఆర్ కోసం రవాణాశాఖ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. మామూలుగా వాహనాలు డ్రైవింగ్ నేర్పించే స్కూళ్ళ యాజమాన్యాలే తమదగ్గర డ్రైవింగ్ నేర్చుకునేవారికి ఎల్ఎల్ఆర్ తీయిస్తారు. ఎల్ఎల్ఆర్ కాలపరిమితి ఆరునెలలుటుంది. ఈ ఆరునెలల్లోనే వాహనయజమాని రవాణాశాఖ పోర్టల్లో పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకోవాలి. స్లాట్ బుక్ కాగానే వాహన యజమాని తనవాహనాన్ని రవాణాశాఖ టెస్టింగ్ ట్రాక్‌కు వెళ్ళి ఒక అధికారి ముందు తనకు డ్రైవింగ్ వచ్చనే విషయాన్ని నిరూపించుకోవాలి. టెస్టింగ్ సమయంలో సదరు అధికారి సంతృప్తిచెందితే అప్పుడు వాహన యజమానికి పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది.
పైన చెప్పిన విధానం ఇపుడు అమల్లో ఉంది. అయితే ఈ రెండంచెల విధానానికి మరో పద్దతిని జతచేయబోతున్నారు రవాణాశాఖ ఉన్నతాధికారులు. అదేమిటంటే కొత్తగా రాబోయే పద్దతి ఎల్ఎల్ఆర్ కన్నా ముందే ఉంటుంది. ‘రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ మాడ్యూల్’ పేరుతో కొత్త విధానం ఉండబోతోంది. దీనిలో ఏముంటుంది అంటే రోడ్ సేఫ్టీ అవేర్ నెస్ పైన ఆన్ లైన్లోనే కొన్నిపరీక్షలకు సదరువ్యక్తి హాజరు కావాల్సుంటుంది. ఇందులో ఏముంటుందంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న విధానంపై వీడియో క్లిప్పింగులు ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాల్లో లక్షలమంది చనిపోతున్నారు. రోడ్డుపై వాహనాలను నడిపే విషయంలో చాలామందికి సరైన అవగాహన ఉండటంలేదు.
రోడ్ సేఫ్టీ అవేర్ నెస్ టెస్టులో ట్రాఫిక్ సిగ్నల్స్ పైన ఏ సిగ్నల్ కు అర్ధం ఏమిటి ? ఏ సిగ్నల్ పడినపుడు వాహనయజమాని ఏమిచేయాలి ? రోడ్డులో టర్నింగ్ తిరిగేటపుడు యజమాని ఎలాంటి సిగ్నల్ చూపించాలి, రోడ్డుపైన వెళుతున్నపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అనే అంశాలపైన టెస్ట్ ఉంటుంది. ఆన్ లైన్లో జరిగే టెస్టుకాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ కావాలని అనుకునే వ్యక్తి సిగ్నల్స్ పైన పూర్తి అవగాహన ఉండాలని రవాణాశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ ఆన్‌లైన్ టెస్టులో పాస్ అయితే వెంటనే ఒక కోడ్ నెంబర్ ఇస్తారు. ఎల్ఎల్ఆర్‌కు దరఖాస్తు చేసుకునేటపుడు సదరువ్యక్తి ఈ కోడ్ ను ప్రస్తావించాల్సుంటుంది. అప్పుడే ఎల్ఎల్ఆర్ దరఖాస్తు ఆన్ లైన్లో ముందుకెళుతుంది. లేకపోతే ఎల్ఎల్ఆర్ దశలోనే రెజెక్టవటం ఖాయం. రవాణాశాఖ నియమించిన ఐదుగురు నిపుణుల కమిటి అద్యయనం చేసి రిపోర్టు ఇచ్చిన తర్వాత కొత్తపద్దతి ఎప్పటినుండి అమల్లోకి వస్తుందనే విషయాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుంది.

