అఘాయిత్యాలు తగ్గాలంటే ఇదొక్కటే మార్గం
మంచి, చెడు గురించి చిన్నపిల్లల్లో సరైన అవగాహన లేకపోవటం వల్లే సమాజంలో చాలా సమస్యలు వస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.
చిన్నపిల్లల్లో లీగల్ లిటరసీపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయం, చాలా అవసరమని సూర్యాపేట మెడికల్ కాలేజీలో సైకియాట్రీ డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్, హెచ్ వో డీ డాక్టర్ బూర్ల వివాశ్వాన్ అభిప్రాయపడ్డారు. మంచి, చెడు గురించి చిన్నపిల్లల్లో సరైన అవగాహన లేకపోవటం వల్లే సమాజంలో చాలా సమస్యలు వస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.
స్కూలు పిల్లల్లో లీగల్ లిటరసీ పై టీచర్లతో పాఠాలు చెప్పించటం ప్రస్తుత పరిస్దితిల్లో చాలా అవసరం. పిల్లలు చిన్నప్పటినుండే మంచి, చెడుపై అవగాహన కలిగుంటే పెద్దయిన తర్వాత సమాజానికి సమస్యగా మారకుండా ఉంటారు. లీగల్ లిటరసీపై స్కూళ్ళలో టీచర్లతోనే కాకుండా మండలానికి ఒక సైకాలజీ కౌన్సిలర్ ను ఏర్పాటు చేసి అన్నీ స్కూళ్ళల్లో మంచి, చెడు చెప్పిస్తుంటే మంచి ఫలితాలు వస్తాయని సూచించిన డాక్టర్.
తమ ఆసుపత్రి/కాలేజీకి కూడా ప్రతిరోజు పిల్లలను కౌన్సిలింగ్ కు తల్లి, దండ్రులు తీసుకుని వస్తుంటారని చెప్పిన ప్రొఫెసర్. స్కూళ్ళల్లో కనుమరుగు అయిపోయిన మోరల్ క్లాసులను మళ్ళీ ప్రవేశ పెట్టి విద్యార్ధులకు మంచి, చెడు గురించి చెప్పించాలని సూచన.

