
ఓటేసిన సీఎం రేవంత్, మంత్రులు
మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్.
తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సాగుతోంది. కొన్ని ప్రాంతాలల్లో పోలింగ్ ప్రక్రియ మందకొడిగా నడుస్తున్నా మరికొన్ని ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగ్ జడ్పీ హైస్కూల్‌లో ఆయన తన ఓటు వేశారు. అనంతరం ఆయన హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. కాసేపట్లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధిర మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన హక్కు. ప్రతి పౌరుడు తన ఓటును బాధ్యతగా, ఆలోచనతో వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య బలోపేతానికి అందరం కలిసి ముందుకు సాగుదాం’’ అని ఆయన తెలిపారు. అదే విధంగా మంచిర్యాలలో హైటెక్‌సిటీలో 227వ నవంబర్ పోలింగ్ బూత్‌లో మంత్రి వివేక్ తన ఓటు వేశారు.

