విడిపోయిన ఎక్స్‌ప్రెస్ రైలు భోగీలు..
x

విడిపోయిన ఎక్స్‌ప్రెస్ రైలు భోగీలు..

నాసిక్ - ముంబై మధ్య నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు విడిపోయాయి. థానేకు సమీపంలోని కసర రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన జరిగింది.


నాసిక్ - ముంబై మధ్య నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు విడిపోయాయి. థానేకు సమీపంలోని కసర రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. అయితే ప్రయాణీకులెవరూ గాయపడలేదని రైల్వే అధికారి తెలిపారు. 40 నిమిషాల తర్వాత బోగీలను మళ్లీ తగిలించి ప్రయాణాన్ని తిరిగి కొనసాగించారు.

‘‘పంచవటి ఎక్స్‌ప్రెస్ నాసిక్ జిల్లాలోని మన్మాడ్ జంక్షన్ నుంచి ముంబాయికి బయల్దేరింది. ముంబైకి 128 కి.మీ దూరంలోని కసర రైల్వే స్టేషన్‌లో రెండు నాలుగు, ఐదు భోగీలు విడిపోయాయి. ఉదయం 8.40 గంటల ప్రాంతంలో రైలు కసర స్టేషన్ నుంచి దాటుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై విచారణ జరుగుతుంది" అని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ స్వప్నిల్ నిల తెలిపారు.

వివిధ కారణాల వల్ల భోగీలను విడదీయడం జరుగుతుంది. రైలు వేగాన్ని పెంచుతున్నప్పుడు ఆకస్మిక కుదుపు కారణంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని మరొక రైల్వే అధికారి తెలిపారు.

Read More
Next Story